హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

హలీం ప్రియులకు చేదు వార్త.. ఈ సారి ఘుమ ఘుమలు ఉండవు..

హలీం ప్రియులకు చేదు వార్త.. ఈ సారి ఘుమ ఘుమలు ఉండవు..

కువైట్‌లో ఈ ఘటన జరిగినట్టు ఖలీజ్ టైమ్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

కువైట్‌లో ఈ ఘటన జరిగినట్టు ఖలీజ్ టైమ్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్యాట హలీ తయారు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు హలీం మేకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, పిస్తా హౌస్ ఎండీ ఎంఏ మాజిద్ తెలిపారు.

రంజాన్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది హలీం..! వారెవ్వా..ఏం రుచి..! పొగలు కక్కుతూ.. ఘుమఘుమలాడూతూ.. మాంసాహార ప్రియులకు అసలు సిసలు రుచిని అందిస్తుంది హలీం. రంజాన్ మాసం ప్రారంభమైదంటే చాలు.. హైదరాబాద్‌లో అడుగడుగునా హలీం బట్టీలు కనిపిస్తాయి. జిల్లాలకు కూడా హలీం రుచులు వ్యాపించాయి. సాయంత్రం వేళ హలీం బట్టీల ముందు జనాల క్యూలు దర్శనమిస్తుంటాయి. మ‌తాల‌తో సంబంధం లేకుండా రుచిక‌ర‌మైన ఈ హ‌లీమ్ కోసం జనాలు బారులు తీరుతారు. కానీ ఈసారి ఆ రుచిని ఆస్వాదించలేం. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ రంజాన్ సీజన్‌లో హలీం దొరకదు. ఈ మేరకు హైదరాబాద్ హలీం మేకర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్యాట హలీ తయారు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు హలీం మేకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, పిస్తా హౌస్ ఎండీ ఎంఏ మాజిద్ తెలిపారు. లాక్ డౌన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి కరోనా నివారణకు ప్రభుత్వం చేసిన పోరాటానికి సహరించాలని కోరారు. ప్రతి రంజాన్ సీజన్‌లో ఒక్క హైదరాబాద్‌లోనే రూ.800 కోట్ల మేర హలీం అమ్మకాలు జరుగతాయని అంచనా. ఇక్కడి నుంచి హలీం రుచులు విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. కానీ లాక్‌డౌన్ కారణంగా ఈసారి హైదరాబాద్‌లో హలీం బట్టీలు కనిపించబోవు. ఈ నేపథ్యంలో హలీం ప్రియులు ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుకుతున్నారు. ఇంట్లోనే హలీం చేసుకోవడం ఎలా? అని యూట్యూబ్‌లో తెగ వెతుకుతున్నారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలను నిషేధం విధించింది. తదుపరి ఆదేశాల వరకు తెలంగాణలో వీటికి అనుమతి ఉండబోదని తెలిపింది. ఇక మే 7 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో.. రంజాన్ పండగను కూడా ఇళ్లలోనే ఉండి జరుపుకోవాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సామూహిక ప్రార్థనలకు అనుమతి ఉండదని తెలిపింది. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. సామాజిక దూరం పాటిస్తేనే కరోనాను కట్టడి చేయగలుగుతామని ప్రజలకు సూచించింది.


First published:

Tags: Coronavirus, Hyderabad, Lockdown, Ramzan, Telangana

ఉత్తమ కథలు