Coronavirus : కరోనా కేసు షీట్ కలకలం... గాంధీ ఆస్పత్రిలో తర్జనభర్జన

గాంధీ ఆస్పత్రి

Coronavirus | Covid 19 : గాంధీ ఆస్పత్రి డాక్టర్లు ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించి ఉండరు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి కేసు షీట్‌ను ఎక్కడ ఉంచాలి? ఏం చెయ్యాలి?

  • Share this:
    Coronavirus | Covid 19 : కొత్త కొత్త రోగాలు... కొత్త కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి. మనందరికీ తెలుసు... గాంధీ ఆస్పత్రిలో ఓ యువకుడు... కరోనా వైరస్ బారినపడి... ఐసోలేషన్ వార్డులో ఉండి... కోలుకొని డిశ్చార్జి అయ్యాడని. అందువల్ల అతనికి సంబంధించి డాక్టర్లు ఓ కేసు షీట్ తయారు చేశారు. సాధారణంగా ప్రతీ పేషెంటూ ఇన్ పేషెంట్ కాగానే... వారి పేరున కేసు షీట్ తెరవడం కామన్. ఇలాంటి షీట్‌లను పేషెంట్ వెళ్లిపోయిన తర్వాత... రూల్స్ ప్రకారం పది సంవత్సరాలపాటూ భద్రంగా ఉంచాల్సి ఉంటుంది. ఐతే... కరోనా వ్యాధి విషయంలో తయారుచేసే కేసు షీట్‌ని ఎక్కడ ఉంచాలి, ఎలా ఉంచాలన్నది ఇప్పుడు సమస్యగా మారింది. ఎందుకంటే... ఆ కేసు షీట్‌పై కరోనా వైరస్ ఉండే అవకాశాలున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసు షీట్‌ని ఎక్కడ బడితే అక్కడ ఉంచలేరు. మిగతా రోగుల కేసు షీట్లతో దాన్ని ఉంచే పరిస్థితి లేదు. దాన్ని ఎక్కడ ఉంచాలో అర్థం కాక... తలలు పట్టుకుంటున్నారు గాంధీ ఆస్పత్రి డాక్టర్లు.

    నిజానికి ఈ కేసు షీటు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే... తెలంగాణలో కరోనా వ్యాధి వచ్చిన తొలి వ్యక్తి అతడు. పైగా కోలుకున్నాడు. అదో వైద్య రికార్డు. అది గాంధీ ఆస్పత్రి డాక్టర్ల ఘనత, ప్రభుత్వ గొప్పదనం కిందకు వస్తుంది. కాబట్టి... అలాంటి కేసు షీటును అత్యంత జాగ్రత్తగా ఉంచాల్సి ఉంటుంది.

    హైదరాబాద్... మహేంద్రహిల్స్‌లో ఉంటున్న ఆ కుర్రాడు... దుబాయ్ వెళ్లడంతో... అక్కడ అతనికి కరోనా వైరస్ సోకింది. తర్వాత అతను బెంగళూరు వెళ్లి... తిరిగి హైదరాబాద్ వచ్చాడు. అతనికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో... శాంపిల్స్ సేకరించి... నిర్ధారించి... మార్చి 1న గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో ఉంచారు. మార్చి 13న డిశ్చార్జి చేశారు. ఈ 13 రోజులూ అతని చేసిన ట్రీట్‌మెంట్, అందించిన మందులు, చేసిన సేవలు, అయిన ఖర్చులు, బిల్లులు అన్నీ కేసు షీట్‌లో ఉంటాయి. ఇతర కరోనా రోజులకు ట్రీట్‌మెంట్ చెయ్యడానికి ఈ కేసు షీట్ ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్లీ ఇలాంటి రోగం దాడి చేస్తే... అప్పుడు ఈ కేసు షీటు ఆధారంగా ట్రీట్‌మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు దీన్ని ఎక్కడుంచాలన్నది తేలాల్సి ఉంది. కరోనా సోకిన పేషెంట్ వాడిన టూత్ బ్రష్, డ్రెసెస్, చెప్పులు, సిరంజులు, సెలైన్ ఫ్లూయిడ్స్, బ్యాగులు వంటివన్నీ బయో మెడికల్ వేస్టేజ్ సిస్టం ద్వారా నాశనం చేశారు. కేసు షీట్ మాత్రం అలాగే ఉంది. తాజాగా అనుకున్నదాని ప్రకారం... దాన్ని దట్టమైన పాలిథిన్ బ్యాగ్‌లో ఉంచి, సీల్ చేసి, ఆ బ్యాగుపై వైరస్ సోకకుండా ఉండే లిక్విడ్‌లను పూసి, ప్రత్యేక అల్మరాలో ఉంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇలా కరోనా కేసులో బాధితుడు డిశ్చార్జి అయినా... డాక్టర్లకు మాత్రం తలనొప్పులు తప్పట్లేదు.
    Published by:Krishna Kumar N
    First published: