Home /News /coronavirus-latest-news /

CORONAVIRUS HOW BEAUTIFIED IMAGES AFFECT PERCEPTIONS OF THE COVID 19 PANDEMIC HERE IS INTERESTING DETAILS GH SK

Coronavirus Images: కోవిడ్ వ్యాధి పట్ల అవగాహనను కరోనావైరస్ ఫొటోలు ఎలా ప్రభావితం చేస్తాయి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Coronavirus: కరోనావైరస్ ఫోటోలు వ్యాధి పట్ల అవగాహనను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయంపై స్పెయిన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూటో డి రేడియో టెలివిజన్ ఎస్పానోలా, యూనివర్సిటాట్ ఆటోనోమా డి బార్సిలోనా (UAB) శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

కరోనా వైరస్​ (Coronavirus) ఏడాదిన్నర నుంచి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. వేరియంట్లుగా రూపం మార్చుకుంటూ మనుషులపై దాడి చేస్తోంది. ప్రస్తుతం అనేక దేశాల్లో డెల్టా వేరియంట్​ విజృంభిస్తోంది. అయితే ఈ వైరస్​ కంటికి కనిపించనప్పటికీ, శాస్త్రవేత్తలు కొన్ని ఊహాజనిత చిత్రాలను వారి అధ్యయనాల్లో ప్రచురిస్తున్నారు. తద్వారా వైరస్​ నిర్మాణ క్రమంపై ప్రజలు కొంత వరకు అవగాహన ఏర్పర్చుకోవచ్చు.   మీడియాలో కూడా కరోనా వైరస్‌కు సంబంధించి ఎన్నో ఫొటోలు, వీడియోలు వచ్చిన విషయం తెలిసిందే. రంగు రంగుల్లో విభిన్న రూపంలో చూపించారు. ఈ క్రమంలో అసలు కరోనా వైరస్​ ఎలా ఉంటుంది? దాని నిర్మాణం ఎలా ఉంటుంది? దీని ఫోటోలు వైరస్‌పై అవగాహనను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయంపై స్పెయిన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూటో డి రేడియో టెలివిజన్ ఎస్పానోలా, యూనివర్సిటాట్ ఆటోనోమా డి బార్సిలోనా (UAB) శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

కరోనావైరస్​ నలుపు, తెలుపు రంగు నిర్మాణంతో ఉంటుందని, ఇది అచ్చం అంటువ్యాధి క్రిమి నిర్మాణంగా కనిపిస్తుందని వారి అధ్యయనంలో తేలింది. అయితే సహజంగా మనకు మీడియాలో వైరస్​ నిర్మాణాన్ని ఆకర్షణీయమైన రంగులు, త్రీ డైమెన్షన్​లో చూపిస్తారు. ఇవి వైరస్ అందాన్ని రెట్టింపు చేసేలా కనిపిస్తాయి. కానీ వాస్తవికంగా దీని నిర్మాణం గజిబిజిగా అంటువ్యాధిని పోలి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు కరోనా సెకండ్ వేవ్​ లాక్‌డౌన్ సమయంలో చేసిన తమ పరిశోధనలో తేలిందని చెబుతున్నారు. వారి అధ్యయన ఫలితాలను PLoS ONE లో ప్రచురించారు.

కరోనా చిత్రాలు (Source: PLoS ONE)


Vaccination Effects: కరోనా టీకాతో రుతుక్ర‌మంలో మార్పులు వస్తాయా..?నిపుణులు ఏం చెబుతున్నారు

* నలుపు, తెలుపు రంగుల్లో వైరస్​ నిర్మాణం..
అధ్యయనంలో పాల్గొన్న వారికి కరోనా వైరస్​ ఫోటోలను చూపించి దాని అందం, సైంటిఫిక్​ నేచర్​, వాస్తవికత, అంటువ్యాధి అవగాహన, భయం, ఫోటోల బోధనా స్వభావం వంటి పారామితుల గురించి ప్రశ్నలు అడిగారు. SARS-CoV-2 వైరస్ విభిన్న ఫోటోలను అధ్యయనంలో పాల్గొన్న వారికి చూపించారు. కలర్ వర్సెస్ బ్లాక్ అండ్ వైట్, 2 డి వర్సెస్ 3 డి, ఫోటో వర్సెస్ ఇలస్ట్రేషన్ వంటి అంశాలపై కూడా ఈ అధ్యయనంలో ప్రశ్నలు అడిగారు. ఈ ఫోటోలు కరోనాపై అవగాహనను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయంపై వారి అధ్యయనం కొనసాగింది.

అప్ప‌టి వ‌ర‌కు మాస్కులు ధ‌రించాలి : స్ప‌ష్టం చేసిన నీతి ఆయోగ్ స‌భ్యులు

కలర్, త్రీడీ ఫోటోల్లో కరోనావైరస్ ఫోటోల అందం ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని అధ్యయనం తేల్చింది. కరోనా వైరస్ ఫోటోల అందం, వైరస్ గురించి వివరించే బోధన విలువ (didactic value) మధ్య నెగెటివ్ కోరిలేషన్ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంటే వైరస్ ఫోటోలు ఎంత అందంగా ఉంటే.. అవి అంత తక్కువ విద్యా సంబంధమైనవిగా (less educational) ఉంటాయని పరిశోధకులు తేల్చారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Corona cases, Corona virus, Coronavirus, Covid-19, COVID-19 cases

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు