తెలంగాణ రాజ్ భవన్‌పై కరోనా పంజా.. గవర్నర్ తమిళిసైకి నెగిటివ్..

తెలంగాణ రాజ్ భవన్‌లో 15 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు నెగిటివ్ వచ్చింది.

news18-telugu
Updated: July 12, 2020, 8:20 PM IST
తెలంగాణ రాజ్ భవన్‌పై కరోనా పంజా.. గవర్నర్ తమిళిసైకి నెగిటివ్..
గవర్నర్ తమిళిసై
  • Share this:
తెలంగాణ రాజ్ భవన్‌లో ఈ రోజు 15 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. మొత్తం 40 మందికి పైగా కరోనా వైరస్ వచ్చినట్టు తేలింది. కరోనా సోకిన వారిలో 28 మంది పోలీసులు, 10 మంది ఇతర సిబ్బంది కాగా, మరికొందరు వారి కుటుంబసభ్యులకు కరోనా సోకినట్టు తేలింది. తెలంగాణ రాజ్ భవన్‌లో ఓకుక్‌కు కూడా కరోనా వచ్చినట్టు సమాచారం. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆమెకు కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ధ్రువీకరించారు. తాను కరోనా టెస్టు చేయించుకున్నానని, నెగిటివ్ వచ్చిందని చెప్పారు. అలాగే, రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో కరోనా కాంటాక్ట్ హిస్టరీ ఉన్న వారు వీలైనంత త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. త్వరగా టెస్టులు చేయించుకోవడం వలన మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు ఇతరులను కూడా కరోనా నుంచి కాపాడవచ్చన్నారు. ఈ విషయంలో ఎవరూ మొహమాటం, భయం, బిడియపడొద్దని హితవు పలికారు. టెస్టు చేయించుకుని ఇతరులను కూడా చేయించుకునేలా ఉత్సాహం నింపాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై 4T ఫార్ములాను ప్రతిపాదించారు. టెస్ట్ (పరీక్ష చేయించుకోవడం), ట్రేస్ (కాంటాక్ట్‌లను గుర్తించడం), ట్రీట్ (బాధితులకు చికిత్స అందించడం) టీచ్ (ఇతరులను చైతన్యపరచడం) లాంటివి చేయాలన్నారు.తెలంగాణలో జూలై 11న ప్రకటించిన లెక్కల ప్రకారం మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 33,402గా ఉంది. మొత్తం మరణాల సంఖ్య 348గా ఉంది. నిన్న జీహెచ్ఎంసీలో అత్యధికంగా 736 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డి (125), మేడ్చల్ (101), సంగారెడ్డి (13), వరంగల్ అర్బన్ (20; కరీంనగర్ (24), పెద్దపల్లి (12), మెదక్ (16), మహబూబ్ నగర్ (12), నల్లగొండ (12), రాజన్న సిరిసిల్ల జిల్లా (24), నిజామాబాద్ (12) కరోనా కేసులు నమోదయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో 10 కంటే తక్కువ సంఖ్యలో కేసులు నిర్ధారణ అయినట్టు ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 12, 2020, 8:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading