ఆ రాజకుటుంబానికి కరోనా కాటు...150 మందికి పాజిటివ్...

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 1815 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది.

84 ఏళ్ళ సౌదీ రాజు జెడ్డాకు సమీపంలోని ఒక దీవిలో క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. రాజకుమారుడు సల్మాన్ తన కుమారుడు ఇతర మంత్రులతో కలసి అదే దీవికి వెళ్లి క్వారంటైన్ లో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

  • Share this:
    కారెవరూ కరోనాకు అనర్హం అన్నట్లు రాజు పేద తేడా లేకుండా అందరికీ వైరస్ సోకుతోంది. తాజాగా సౌదీ రాజకుటుంబీకుల్లో 150 మందికి కరోనా సోకినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే సౌదీ రాయల్ ఫ్యామిలీకి చెందిన వారిలో దాదాపు 15000 మంది ఉన్నారు. ఈ క్రమంలో రియాద్ గవర్నర్ గా ఉన్న సీనియర్ యువరాజు ఐసీయూలో ఉండగా రాజు సల్మాన్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఈ మేరకు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వార్తను ప్రచురించింది. రాయల్ ఫ్యామిలీ సభ్యులకు కరోనా సోకడంతో కింగ్ ఫైజల్ స్పెషలిస్ట్ ఆసుపత్రిలోని డాక్టర్లకు ఆసుపత్రి వర్గాలు హైఅలెర్ట్ జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇక 84 ఏళ్ళ సౌదీ రాజు జెడ్డాకు సమీపంలోని ఒక దీవిలో క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. రాజకుమారుడు సల్మాన్ తన కుమారుడు ఇతర మంత్రులతో కలసి అదే దీవికి వెళ్లి క్వారంటైన్ లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే సౌదీలో ఇప్పటివరకు 2932 మందికి కరోనా సోకగా, 41 మంది చనిపోయారు. ఇక 631 మంది ఈ కరోనా వైరస్ నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
    Published by:Krishna Adithya
    First published: