ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. అన్ని దేశాలను అతలాకుతలం చేస్తోంది. పెరుగుతున్న కేసులతో అన్ని దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ఎన్నో చర్యలు చేపడుతన్నా.. కంట్రోల్ కావడం లేదు. ఈ క్రమంలో కరోనా కేసుల తగ్గించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా పరీక్షలు కత్తి రెండు వైపులా పదును లాంటిదని..ఎక్కువ టెస్ట్‌లు చేస్తే ఎక్కువ కేసులే వస్తాయని అన్నారు. అదే తక్కువ టెస్ట్‌లు చేస్తే తక్కవ కేసులే బయటపడతాయని చెప్పుకొచ్చారు. ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు చూస్తే.. అమెరికాలోనే ఎక్కువగా ఉన్నాయి. ఐతే మొదట ఎక్కువ టెస్ట్‌లు చేసిన అమెరికా ప్రభుత్వం.. ఇటీవల టెస్ట్‌లను గణనీయంగా తగ్గించింది. అందుకే కేసులు కొంత తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా, అమెరికాలో ఇప్పటి వరకు2 23,31,550 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 9,73,055 మంది కోలుకోగా.. 1,22,003 మంది మరణించారు. ప్రస్తుతం అమెరికాలో 12,36,492 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Coronavirus, Covid-19, Donald trump