దగ్గినందుకు తుపాకీతో కాల్చేశాడు.. కరోనా భయంతో దారుణం

దగ్గడం, ముక్కు నుంచి నీరు కారడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది, జ్వరం ఉంటే అవి కరోనా లక్షణాలు. ఈ క్రమంలోనే ప్రవేశ్ కరోనావైరస్‌ను వ్యాప్తి చెందేలా ప్రవర్తిస్తున్నాడంటూ గుల్లు కాల్పులు జరిపాడని పోలీసులు చెప్పారు.

news18-telugu
Updated: April 15, 2020, 9:26 PM IST
దగ్గినందుకు తుపాకీతో కాల్చేశాడు.. కరోనా భయంతో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రస్తుతం యావత్ ప్రపంచానికి కరోనా ఫీవర్ పట్టుకుంది. ఎవరైనా తమ్మినా.. దగ్గినా.. ప్రజలు భయపడిపోతున్నారు. జ్వరంతో ఉన్న వ్యక్తులను దగ్గరకు కూడా రానీయడం లేదు. బహిరంగ ప్రదేశాల్లో తుమ్మడం, దగ్గడం చేసిన వ్యక్తులపై దాడి జరిగిన ఘటనలూ ఉన్నాయి. ఐతే తాజాగా యూపీలోనూ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. తుమ్మినందుకు పాతికేళ్ల యువకుడిపై దుండగుడు కాల్పులు జరిపాడు. కరోనా భయంతో బీభత్సం సృష్టించాడు. గ్రేటర్ నోయిడా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దయానగర్‌కు చెందిన ప్రశాంత్ సింగ్ అలియాస్ ప్రవేశ్ (25) వ్యవసాయం చేసుకుంటూ జీవన సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌తో పనులు లేక ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గ్రామంలోని ఓ దేవాలయంలో మరో ముగ్గురు మిత్రులో కలిసి లూడో గేమ్ ఆడాడు. వారు గేమ్ ఆడుకుంటున్న క్రమంలో జైవీర్ సింగ్ అలియాస్ గుల్లు (30) అక్కడికి వచ్చాడు. అదే సమయంలో ప్రవేశ్ దగ్గాడు. అప్పుడు ఎవరూ ఏమనలేదు. ఆ తర్వాత కాసేపటికే మళ్లీ దగ్గాడు. దాంతో కోపోద్రిక్తుడైన గుల్లు ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేస్తున్నావంటూ ప్రవేశ్‌పై మండిపడ్డారు. ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో.. గుల్లు తన జేబులో నుంచి తుపాకీ తీసి ప్రవేశ్‌పై కాల్పులు జరిపాడు.

కాల్పులు జరిపిన అనంతరం గుల్లు అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో తోటి మిత్రులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరించాడు. ప్రస్తుతం ప్రవేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దగ్గడం, ముక్కు నుంచి నీరు కారడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది, జ్వరం ఉంటే అవి కరోనా లక్షణాలు. ఈ క్రమంలోనే ప్రవేశ్ కరోనావైరస్‌ను వ్యాప్తి చెందేలా ప్రవర్తిస్తున్నాడంటూ గుల్లు కాల్పులు జరిపాడని పోలీసులు చెప్పారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని.. త్వరలోనే అతడిని పట్టుకుంటామని తెలిపారు.
First published: April 15, 2020, 9:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading