ప్రభుత్వం నిద్ర పోతోంది.. తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

కరోనా పరీక్షల విషయంలో.. ఏపీ, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ చాలా వెనకబడి ఉందని హైకోర్టు తెలిపింది. కేసులు పెరిగిపోతుంటే ప్రభుత్వం నిద్రపోతోందని, ప్రజలను గాలి వదిలేసిందని ధ్వజమెత్తింది.

news18-telugu
Updated: July 20, 2020, 4:18 PM IST
ప్రభుత్వం నిద్ర పోతోంది.. తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం
హైకోర్టు, కేసీఆర్
  • Share this:
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కేసులు పెరిగిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతూ.. ప్రజలను గాలికి వదిలేసిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన హైకోర్టు.. తాజాగా మరోసారి విరుచుకుపడింది. తక్కువ కరోనా పరీక్షలు, మీడియా బులెటిన్‌లో స్పష్టత లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదని.. తమ ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పదే పదే ఆదేశిస్తున్నప్పటికీ ఒక్కటి కూడా అమలు కావడం లేదని విమర్శించింది.

కరోనా పరీక్షల విషయంలో.. ఏపీ, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ చాలా వెనకబడి ఉందని హైకోర్టు తెలిపింది.

కేసులు పెరిగిపోతుంటే ప్రభుత్వం నిద్రపోతోందని, ప్రజలను గాలి వదిలేసిందని ధ్వజమెత్తింది. కరోనా బులిటెన్‌, బెడ్ల వివరాలపై అధికారులు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది. అంతేకాదు కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వాన్ని హైకోర్టు అభినందించిందని మీడియా బులెటిన్‌లో పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మేం చివాట్లు పెడుతుంటే.. అభినిందించిందని ప్రజలకు తప్పుదోవ పట్టిస్తారా అని హైకోర్టు విరుచుకుపడింది.

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 45వేలు దాటింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 45076 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 32,438 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఐతే కరోనా డిశ్చార్జ్ రేటు అత్యధికంగా ఉంది. ఇదొక్కటే ఊరట అని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు 2,65,219 కరోనా శాంపిల్స్ టెస్టు చేశారు. గడిచిన 24 గంటల్లో 12,519 శాంపిల్స్ టెస్ట్ చేశారు. ఇక బెడ్స్ విషయానికి వస్తే రాష్ట్రంలో 17,081 బెడ్స్ అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. ఇందులో 1900 బెడ్స్‌ ఆక్యుపై అయింది. 15,181 బెడ్స్ ఇంకా ఖాళీగా ఉన్నాయి
Published by: Shiva Kumar Addula
First published: July 20, 2020, 4:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading