కోళ్లు ఉచితం.. చికెన్ రూ.40 మాత్రమే.. వీడియోలు వైరల్..

కోళ్లు ఉచితం.. చికెన్ రూ.40 మాత్రమే.. వీడియోలు వైరల్..

ప్రతీకాత్మక చిత్రం

చికెన్ రేట్లు భారీగా పడిపోవడంతో.. సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. ఎప్పటికీ ఇలానే ఉంటే బాగుటుందని కొందరు అభిప్రాయపడితే.. ఇంకొందరు మాత్రం పాపం పౌల్ట్రీ రైతులు అని సానుభూతి ప్రకటిస్తున్నారు

 • Share this:
  కోవిడ్-19 (కరోనా వైరస్) యావత్ ప్రపంచంతో పాటు భారతీయుల గుండెల్లోనూ గుబులు పుట్టిస్తోంది. దీని పేరు చెబితేనే మనోళ్లు వణికిపోతున్నారు. కరోనాదెబ్బకు పలు వ్యాపార రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ వ్యాపారం పూర్తిగా కుప్పకూలింది. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందన్న పుకార్లతో.. చికెన్ తినేందుకు జనం జంకుతున్నారు. ఈ క్రమంలో చికెన్ రేట్లు భారీగా పడిపోయాయి. సాధారణంగా రూ.180-200 ఉండే కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర ఇప్పుడు కేవలం రూ.50 మాత్రమే పలుకుతోంది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో రూ.50 కే కిలో చికెన్ అమ్ముతున్నారు.

  ఇక డ్రెస్‌డ్ చికెన్ అయితే కిలో రూ.42కు మాత్రమే విక్రయిస్తున్నారు వ్యాపారులు. పలు ప్రాంతాల్లో రూ.30కే అమ్ముతున్నారు. లైవ్ కోళ్ల రేటు రూ.20-30 మధ్య ఉంది. చికెన్ రేట్లు ఈస్థాయిలో పడిపోవడం.. చరిత్రలో బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. ఇంత తక్కువకు అమ్మినా.. చికెన్ షాపులు మాత్రం వెలవెలబోతున్నాయి. మాంసం కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దాంతో హైదరాబాద్‌లో చాలా చికెన్ షాపులు ఇప్పటికే మూతపడ్డాయి. కోళ్ల ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు భరించలేక కొందరు వ్యాపారులు పౌల్ట్రీఫామ్ వద్దే ఉచితంగా కోళ్లను పంపిణీ చేస్తున్నారు. సూర్యాపేటలో పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు కనిపించాయి.

  చికెన్ రేట్లు భారీగా పడిపోవడంతో.. సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. ఎప్పటికీ ఇలానే ఉంటే బాగుటుందని కొందరు అభిప్రాయపడితే.. ఇంకొందరు మాత్రం పాపం పౌల్ట్రీ రైతులు అని సానుభూతి ప్రకటిస్తున్నారు.
  @fzchandhumudhiraj

  ##cornavirus effect

  ♬ sandyns boy - śàndymadavi

  @krishnam8898

  ##fantasticholi

  ♬ original sound - krishna m

  @gopichandu05

  ##dubacharala##caronavirus ##chickenleg

  ♬ original sound - Durgakurapati
  Published by:Shiva Kumar Addula
  First published: