వామ్మో.. మెదక్‌లో ఒకే ఇంట్లో నలుగురికి కరోనా పాజిటివ్..

అలా చేయడం వల్ల కరోనా బాధితులను త్వరగా గుర్తించవచ్చని, మరికొందరికి వ్యాపించే ప్రమాదాన్ని తప్పించవచ్చని కేంద్రం అభిప్రాయపడింది.

బాధితుడు ఢిల్లీలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి రావడంతో అతడికి వైరస్ సోకింది. అతడి నుంచి భార్య, కుమారుడు, కోడలికి కూడా కరోనావైరస్ సంక్రమించింది.

  • Share this:
    తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఢిల్లీ నిజాముద్దీన్‌లో తబ్లిఘీ జమాత్ సదస్సు హాజరైన వారిలో చాలా మందికి వైరసో సోకడం, వారి నుంచి కుటుంబ సభ్యులకు కూడా వైరసో వ్యాప్తి చెందడంతో.. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మెదక్ జిల్లాలో ఒకే ఇంట్లో నలుగురికి కరోనా సోకింది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబంలో 12 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. బాధితుడు ఢిల్లీలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి రావడంతో అతడికి వైరస్ సోకింది. అతడి నుంచి భార్య, కుమారుడు, కోడలికి కూడా కరోనావైరస్ సంక్రమించింది. ఇలా ఒకే ఇంట్లో నాలుగు కరోనా కేసులు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇతర కుటుంబ సభ్యులను ఇంట్లోనే క్వారంటైన్ చేశారు.

    తెలంగాణలో గురువారం రాత్రి వరకు అధికారికంగా 154 పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో 17 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా... 9 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 128 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 27 పాజిటివ్ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారిలో చాలా మందిని గుర్తించి పరీక్షలు చేస్తున్నామని.. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఢిల్లీకి వెళ్లొచ్చినవారు స్వచ్చందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకుంటే.. వారికి, కుటుంబ సభ్యులతో పాటు దేశానికి మేలు చేసిన వారవుతారని విజ్ఞప్తిచేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: