గద్వాలలో వద్ద ఇరాన్ దేశస్థుల హల్‌చల్.. లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా..

గద్వాలలో వద్ద ఇరాన్ దేశస్థుల హల్‌చల్.. లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా..

పోలీసుల అదుపులో ఇరాన్ దేశస్థులు

తమిళనాడు నుంచి ఏపీ మీదుగా కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు.. తెలంగాణలోకి ప్రవేశించేందుకు యత్నించారు. పుల్లూరు వద్దే వారి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు.

 • Share this:
  విదేశాల నుంచి వచ్చిన వారెవరైనా సరే.. 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. కరోనా వైరస్ దేశాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలివి. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ రూల్స్‌ని పక్కాగా అమలు చేస్తున్నారు. విదేశాల నుంచి కాదుకదా.. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన భారతీయులనే అధికారులు వదిలిపెట్టడం లేదు. అలాంటిది విదేశీయులను ఎలా వదలిపెడతారు. కానీ ఏపీ, తెలంగాణ సరిహద్దు పుల్లూరు టోల్‌ప్లాజా (గద్వాల జిల్లా) వద్ద ఇరాన్ దేశస్థులు రెచ్చిపోయారు. తెలంగాణలోకి ప్రవేశించేందుకు యత్నించడంతో అధికారులు అడ్డుకున్నారు.

  రాన్ దేశానికి చెందిన మహమ్మద్ ఖాన్, అక్తర్ మస్తజ, అబ్బాస్ అలీలియ, సింజత కోహికర్.. తమిళనాడు నుంచి ఏపీ మీదుగా కారులో వచ్చారు. జోగులంబా గద్వాల్ జిల్లా పుల్లూర్ టోల్ ప్లాజా దగ్గర వారిని గుర్తించిన తెలంగాణ అధికారులు నిలదీశారు. లాక్‌డౌన్‌ వేళ ఎలా వచ్చారంటూ ప్రశ్నించారు. ఐతే తమను అనుమతించాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు ఇరానీలు. కోల్‌కతా, చెన్నై నుండి వస్తున్నామని, తమను ఎవరూ అడ్డుకోలేదని రచ్చ చేశారు. తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో కి అనుమతిస్తే తమ దేశానికి వెళ్ళిపోతామని చెప్పారు.

  ఐనా పోలీసులు మాత్రం వారిని అనుమతించలేదు. లాక్‌డౌన్ సమయంలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఉన్నత అధికారుల నుండి అనుమతి వచ్చేంతవరకు ఇక్కడే వెయిట్ చేయాలి  తెలిపారు. ఇక వారిని చూసి పోలీసులతో పాటు ఇతర ఉద్యోగస్తులు ఆందోళనకు గురయ్యారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. వీరిని ఇక్కడ ఉండడం అంత మంచిది కాదని, తక్షణమే మరో చోటికి తరలించాలని కోరుతున్నారు. ఐతే, మూడు నెలల కిందటే.. వాళ్లు ఇరాన్ నుంచి ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది.
  Published by:Shiva Kumar Addula
  First published: