కరోనా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు పేషెంట్లు మృతి

ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న మొత్తం ఐదుగురు కరోనా పేషెంట్లు చనిపోయారని అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: May 12, 2020, 2:42 PM IST
కరోనా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు పేషెంట్లు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్‌లో తీవ్ర కలకలం రేగింది. కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు కరోనా బాధితులు  చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన వేరొక ఆస్పత్రికి తరలించారు. రష్యన్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. కరోనా ఐసీయూ వార్డులో ఓ వెంటిలేటర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దాంతో ఆ వార్డులో దట్టమైన పొగలు అలుముకోవడంతో.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఐదుగురు పేషెంట్లు మరణించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది 150 మందిని కాపాడి సమీపంలో ఉన్న వేరొక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న మొత్తం ఐదుగురు కరోనా పేషెంట్లు చనిపోయారని అధికారులు తెలిపారు.

కాగా, అమెరికా, స్పెయిన్ తర్వాత రష్యాలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. రష్యాలో ఇప్పటి వరకు 232,243 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 43,512 కోలుకోగా.. 2,116 మంది మరణించారు. ప్రస్తుతం రష్యాలో 1,86,615 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. వీరిలో 2,300 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: May 12, 2020, 2:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading