గుంటూరులో తొలి కరోనా మరణం.. చనిపోయిన తర్వాత పాజిటివ్

అప్రమత్తమైన ఏపీ వైద్యఆరోగ్యశాఖ అధికారులు మృతుడి కుటుంబ సభ్యులను క్వారంటైన్ సెంటర్లకు తరలించి పరీక్షలు చేస్తున్నారు.

news18-telugu
Updated: April 9, 2020, 3:21 PM IST
గుంటూరులో తొలి కరోనా మరణం.. చనిపోయిన తర్వాత పాజిటివ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనావైరస్‌తో ఏపీలో మరొకరు చనిపోయారు. గుంటూరు జిల్లాలో తొలి కరోనా మరణం నమోదయింది. నరసరావుపేట వరకట్టకు చెందిన ఓ వ్యక్తి 10 రోజుల క్రితం టీబీ వ్యాధి చికిత్స కోసం IDH ఆస్పత్రిలో చేరాడు. ఐతే చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం అతడు కన్నుమూశాడు. కరోనా అనుమానంతో మృతదేహం నుంచి శాంపిల్స్ తీసి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని నరసరావుపేట ఆర్డీవో ఎం. వెంకటేశ్వర్లు ధృవీకరించారు. అప్రమత్తమైన ఏపీ వైద్యఆరోగ్యశాఖ అధికారులు మృతుడి కుటుంబ సభ్యులను క్వారంటైన్ సెంటర్లకు తరలించి పరీక్షలు చేస్తున్నారు. అంతేకాదు మృతడి నివసించే వరవకట్టతో పాటు వృతిరీత్యా తిరిగిన రామిరెడ్డి, పల్నాడు రోడ్ ప్రాంతాలను రెడ్‌జోన్‌లుగా ప్రకటించారు.

కాగా, ఏపీలో ఇప్పటి వరకు 348 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 9 మంది కోలుకోగా.. నలుగురు చనిపోయారు. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన కోవిడ్ 19 పరీక్షల్లో ఏ ఒక్కరికీ పాజిటివ్ రాలేదు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కేసులు, గుంటూరులో 49, నెల్లూరులో 48 మందికి కరోనా వైరస్ సోకింది. ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మాత్రం కరోనా ఫ్రీ జిల్లాలుగా కొనసాగుతున్నాయి.

First published: April 9, 2020, 3:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading