హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

No Time to Die: జేమ్స్‌ బాండ్‌కు తప్పని కరోనా వైరస్ దెబ్బ..

No Time to Die: జేమ్స్‌ బాండ్‌కు తప్పని కరోనా వైరస్ దెబ్బ..

జేమ్స్ బాండ్ డేనియల్ క్రేగ్ (ఫైల్ ఫోటో)

జేమ్స్ బాండ్ డేనియల్ క్రేగ్ (ఫైల్ ఫోటో)

Coronavirus: చైనాలో మొదలై లక్షల మందికి ఈ వైరస్ సోకింది. ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ ప్రభావంతో కొన్ని సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. ఇప్పుడు జేమ్స్ బాండ్ లేటెస్ట్ సిరీస్ నో టైమ్ టూ డై సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది.

ఇంకా చదవండి ...

కరోనా వైరస్‌ దెబ్బకు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ముఖ్యంగా అన్ని రంగాల్లోనూ ఈ వైరస్ ప్రభావం కనిపిస్తుంది. అన్నిచోట్లా నష్టాలు కూడా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సినిమా వాళ్లను కూడా చాలా ఇబ్బందులు పెడుతుంది కరోనా వైరస్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ పేరు వింటే చాలు భయంతో గజగజ వణికిపోతున్నారు దర్శక నిర్మాతలు. వాళ్లకు వస్తుందేమో అని కాదు.. వాళ్లు తీసిన సినిమాలు కరోనా వస్తుందేమో అనే భయంతో ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదని. తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు హాలీవుడ్ కూడా దీనికి బలైపోతుందిప్పుడు. ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాలు ఈ మహహ్మారి బారిన పడ్డాయి.

‘నో టైమ్ టూ డై’ జేమ్స్ బాండ్ సినిమా పోస్ట్ పోన్ (Instagram/Photo)
‘నో టైమ్ టూ డై’ జేమ్స్ బాండ్ సినిమా పోస్ట్ పోన్ (Instagram/Photo)

చైనాలో మొదలై లక్షల మందికి ఈ వైరస్ సోకింది. ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ ప్రభావంతో కొన్ని సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. హాలీవుడ్ సూపర్ స్టార్ జాకీ చాన్ కొత్త సినిమా కూడా జనవరిలోనే రావాల్సింది కరోనా దెబ్బకు ఎప్పుడు వస్తుందో తెలియకుండా అయిపోయింది. ఇక ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్న జేమ్స్ బాండ్ లేటెస్ట్ సిరీస్ నో టైమ్ టూ డై సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది.

‘నో టైమ్ టూ డై’ జేమ్స్ బాండ్ సినిమా పోస్ట్ పోన్ (Instagram/Photo)
‘నో టైమ్ టూ డై’ జేమ్స్ బాండ్ సినిమా పోస్ట్ పోన్ (Instagram/Photo)

హాలీవుడ్ సినిమాలకు చైనా మార్కెట్‌ ఎక్కువ. అందుకే అక్కడి మార్కెట్ దృష్టిలో పెట్టుకొని సినిమాలను విడుదల చేస్తుంటారు. ఇప్పుడు అక్కడే సినిమాలు చూసే పరిస్థితి లేదు. అందుకే తమ సినిమాలను మరో ఛాన్స్ లేక వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పుడు జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌లోని తాజా సినిమా నో టైమ్ టు డై కూడా సమ్మర్ విడుదలకు ప్లాన్ చేసి.. ఇప్పుడు నవంబర్‌కు పోస్ట్ పోన్ చేసారు. అప్పటి వరకు అన్నీ సెట్ అవుతాయని చిత్రయూనిట్ భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా సంచలనాలు సృష్టించింది. మొత్తానికి హాలీవుడ్ టూ టాలీవుడ్ అన్ని చోట్లా కరోనా వైరస్ కలకలం సాగుతుంది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Coronavirus, Hollywood

ఉత్తమ కథలు