బాలీవుడ్‌ను చావు దెబ్బ తీసిన కరోనా.. ఎన్ని వందల కోట్ల నష్టమంటే..

బాలీవుడ్ ఇండస్ట్రీపై కరోనా ఎఫెక్ట్ (Twitter/Photo)

CoronaVirus Effect on Bollywood | చైనాతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కరోనా దెబ్బకు బాలీవుడ్, టాలీవుడ్ సహా అన్ని ఇండస్ట్రీలు భారీ నష్టాలను మూట గట్టుకుంటున్నాయి.

  • Share this:
    CoronaVirus Effect on Bollywood | చైనాతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.  చైనాలో వ్యాప్తి చెందిన ఈ వైరస్ కారణంగా ఎంతో మంది అకాల మరణం పొందారు.  కేవలం కరోనా వైరస్ చైనా దేశాన్నే కాదు..  ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. కరోనా ఎఫెక్ట్‌‌తో మన దేశంలో కూడా ఒకరిద్దరు చనిపోయిన సంగతి తెలిసింది కదా.  ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌తో టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు..  అన్ని ఇండస్ట్రీస్‌కు సంబంధించిన పెద్ద సినిమాలు రీ షెడ్యూల్ చేయాల్సి వస్తోంది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ కారణంగా అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ సినిమా సహా పలు సినిమాల విడుదల తేదిలు వాయిదా పడ్డాయి. అంతేకాదు దేశ వ్యాప్తంగా అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ రద్దు చేయబడ్డాయి. ఇప్పటికే కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా తెలంగాణ,దిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ,కర్ణాటక, పంజాబ్, ఒడిస్సా రాష్ట్రాలు థియేటర్స్‌ బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసారు. దేశ వ్యాప్తంగా ఎంత లేదన్న 3వేలకు పైగా థియేటర్లు మూత పడ్డాయి. దీంతో బాలీవుడ్ దాదాపు రూ.1000 కోట్ల వరకు నష్టపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చిత్ర పరిశ్రమపై డైరెక్ట్‌గా ఇన్ డైరెక్ట్‌గా ఆధార పడ్డ చాలా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.

    tiger shroff shraddha kapoor Bhaghi 3 Trailer talk total action dhamaka,tiger shroff,tiger shroff baaghi 3,tiger baaghi 3 trailer,baaghi 3 trailer,baaghi 3 official trailer,baaghi 3,baaghi 3 trailer reaction,baaghi 3 tiger shroff,baaghi 3 movie trailer,baaghi 3 movie,baaghi 3 teaser,baaghi 3 full movie,baaghi 3 first look,baaghi 3 trailer review,baaghi 3 songs,baaghi 3 shraddha kapoor,baaghi 2 trailer,baaghi 3 trailer tiger shroff,baaghi 3 release date,baaghi 3 cast,baaghi,baaghi 3 action,tiger shroff baaghi 3,trailer,bollywood,hindi cinema,టైగర్ ష్రాఫ్,టైగర్ ష్రాఫ్ భాఘీ 3 ట్రైలర్,భాఘీ ట్రైలర్ టాక్,భాఘీ ట్రైలర్,
    ‘భాఘీ3’లో టైగర్ ష్రాఫ్ (Twitter/Photo)


    మార్చి 6న రిలీజైన టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్‌ల ‘భాఘీ3’ కరోనా ఎఫెక్ట్‌లో కూడా దాదాపు రూ.100 కోట్లకు పైగా రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకవేళ కరోనా ఎఫెక్ట్ లేకుండా ఉంటే దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టేదని చిత్ర దర్శకుడు అహ్మద్ ఖాన్ పేర్కొన్నారంటే పరిస్థితి ఎలా ఉందదనేది స్పష్టమవుతుంది. ఇక ఇర్ఫాన్ ఖాన్ నటించిన అంగ్రేజి మీడియం కూడా మూడు రోజుల్లోనే రూ.60 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్స్ మూసివేయాలని తీసుకున్న నిర్ణయంతో ఈ సినిమాలు దారణంగా నష్టపోతున్నాయి. ఈ థియేటర్స్ బంద్ కారణంగా ‘భాఘీ 3’ చిత్ర నిర్మాతలకు దాదాపు రూ.30 కోట్ల వరకు నష్టం వాటిల్లింది.ఈ ఎఫెక్ట్ అంగ్రేజీ మీడియం సినిమాపై పడింది.

    akshay kumar ajay devgn ranveer singh rohit shetty suryavanshi trailer released.,akshay kumar Sooryavanshi trailer,akshay kumar,ajay devgn ranveer singh sooryavanshi,rrr,rrr ajay devgn,rohit shetty,ranveer singh,sooryavanshi,akshay kumar,rohit shetty,suryavanshi,akshay kumar rohit shetty,akshay kumar,akshay kumar donates rs 1 crore for phani cyclone victims,akshay kumar twitter,akshay kumar instagram,suryavanshi akshay kumar,akshay kumar suryavanshi,sooryavanshi akshay kumar,sooryavanshi,veer suryavanshi,akshay kumar veer sooryavanshi,akshay kumar upcoming movies,sooryavanshi movie,akshay kumar movies,sooryavanshi teaser,sooryavanshi trailer,askhay kumar meet rohit shetty for suryavanshi movie,rohit shetty interview,veer sooryavanshi,karan johar rohit shetty ajay devgn ranveer singh akshay kumar,simmba,singam,bollywood,jabardasth comedy show,rashmi gautam,అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్ సూర్యవంశీ స్టార్ట్,రోహిత్ శెట్టి అక్షయ్ కుమార్,కరణ్ జోహార్,అక్షయ్ అజయ్ దేవ్‌గణ్ రణ్‌వీర్ సింగ్ రోహిత్ శెట్టి,సింబా,సింగం సిరీస్,ఆర్ఆర్ఆర్ అజయ్ దేవ్‌గణ్,సూర్యవంశీ ట్రైలర్
    అక్షయ్,అజయ్,రణ్‌వీర్ సింగ్ ‘సూర్యవంశీ’ ట్రైలర్ విడుదల (Youtube/Credit)


    మార్చి 6న విడుదలైన ‘బాఘీ 3’.. మొదటి వారంలోనే 90.67 కోట్ల రూపాయలు వసూలు చేసింది. టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘ఆంగ్రేజీ మీడియం’ తొలి మూడు రోజుల్లోనే 59.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే ఆ తర్వాత థియేటర్లు మూతపడటంతో ఈ సినిమాలు నష్టపోతున్నాయి. ‘బాఘీ 3’ నిర్మాతలకి  25 నుంచి 30 కోట్ల రూపాయల మేర నష్టం వచ్చిందని ట్రేడ్‌ వర్గాల సమాచారం. వారాంతాల్లో థియేటర్లు మూసివేయడంతో ‘ఆంగ్రేజీ మీడియం’పై కూడా ప్రభావం పడింది. ఈ సినిమా కూడా నష్టాల బారిన పడింది.తెలుగులో కూడా నాని హీరోగా నటించిన ‘వీ’ సినిమా సహా రానా అరణ్య సహా పలు చిత్రాల విడుదల వాయిదా పడ్డాయి. ఈ  ఎఫెక్ట్.. ఒక చైన్‌లా అన్ని సినిమాలపై ప్రభావం చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

    నాని వి సినిమా (Nani V movie poster)
    నాని వి సినిమా (Nani V movie poster)


    మొత్తంగా కరోనా ఎఫెక్ట్ కారణంగా పెద్ద సినిమాలన్ని తమ సినిమాల విడుదల తేదీలను రీ షెడ్యూల్ చేసుకున్నాయి. మరోవైపు హాలీవుడ్‌లో కూడా జేమ్స్ బాండ్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కూడా కరోనా ఎఫెక్ట్ కారణంగా విడుదల వాయిదా పడ్డాయి. మొత్తానికి ఇండస్ట్రీకి కరోనాతో దాదాపు రూ. 1000 పైగా నష్టాలు వాటిలినట్టు చెబుతున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: