హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Coronavirus: కరోనా వైరస్‌పై మంచు లక్ష్మి ట్రోల్ వీడియో..

Coronavirus: కరోనా వైరస్‌పై మంచు లక్ష్మి ట్రోల్ వీడియో..

మంచు లక్ష్మి ఫైల్ ఫోటో (Manchu Lakshmi)

మంచు లక్ష్మి ఫైల్ ఫోటో (Manchu Lakshmi)

Coronavirus: ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా వైరస్ గడగడలాడిస్తుంది. ఎక్కడో చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు అన్ని దేశాలు దాటుకుంటూ ఇండియాకు వచ్చేసింది. తెలంగాణలో కూడా ఓ సాఫ్ట్‌వేర్ అమ్మాయికి కరోనా సోకిందని..

ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా వైరస్ గడగడలాడిస్తుంది. ఎక్కడో చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు అన్ని దేశాలు దాటుకుంటూ ఇండియాకు వచ్చేసింది. తెలంగాణలో కూడా ఓ సాఫ్ట్‌వేర్ అమ్మాయికి కరోనా సోకిందని డాక్టర్లు తేల్చడంతో అంతా వణికిపోతున్నారు. ఇక ఇప్పుడు ఈ వైరస్‌పై సెలబ్రిటీస్ కూడా జాగ్రత్తలు చెబుతున్నారు. అయితే కొన్ని రోజుల ముందు ఇదే కరోనా వైరస్ ఇండియాకు వస్తుందంట.. అందులోనూ తెలంగాణకు వస్తుందంట అంటూ మీడియా చెబితే ఛార్మి లాంటి వాళ్లు జోకులు పేల్చారు. వర్మ కూడా ఇందులో ఉన్నాడు. కరోనా వైరస్ తెలంగాణకు వచ్చేసిందట.. ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పి పరువు పోగొట్టుకుంది ఛార్మి.

మంచు లక్ష్మి ఫైల్ ఫోటో (Manchu Lakshmi)
మంచు లక్ష్మి ఫైల్ ఫోటో (Manchu Lakshmi)

వర్మ కూడా ఇదే రకంగా సెటైర్లు వేసాడు. కట్ చేస్తే ఇప్పుడు నిజంగానే కరోనా వైరస్ ఇండియాకే కాదు.. ఏకంగా తెలంగాణ వరకు వచ్చేసింది. ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి ట్రోలింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నాలుగేళ్ల కింద సైమా అవార్డ్స్ అప్పుడు అల్లు శిరీష్‌తో మాట్లాడుతూ R సైలెంట్ ఉండాలి అంటూ చెప్పింది. అప్పట్లో ఈ వీడియో బాగా పాపురల్ అయింది. అయితే ఇప్పుడు మంచు లక్ష్మి పేరును వాడుకుంటూ ఓ వీడియో ఎడిట్ చేసారు.

మంచు లక్ష్మి ఫైల్ ఫోటో (Manchu Lakshmi)
మంచు లక్ష్మి ఫైల్ ఫోటో (Manchu Lakshmi)

టిక్ టాక్ సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో ఈ వీడియో దుమ్ము దులిపేస్తుంది. నీలు అనే అకౌంట్ నుంచి ఈ వీడియో విడుదలైంది. మంచు లక్ష్మి నిజంగా ఇలా మాట్లాడిందా అంటూ అంతా షాక్ అవుతున్నారు. అది 'కరోనా' వైరస్ కాదని.. కర్రోనా వైరస్ అంటూ చెప్పింది ఈమె. అక్కడ ఆర్ షుడ్ బీ రోలింగ్.. అంటే.. ఆర్ అనేది రోల్ అవ్వాలన్నమాట అంటే.. ఆర్ కిందపడి దొర్లాలన్న మాట అంటూ మంచు లక్ష్మీ స్టైల్‌లో చెప్పారు. సైమా అవార్డ్స్ అప్పుడు శిరీష్‌తో మాట్లాడిన మాటలని ఇప్పుడు ఎడిట్ చేసి కరోనా కోసం వాడేసుకున్నారు కొందరు ట్రోలర్స్.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Coronavirus, Manchu Lakshmi, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు