కరోనా ఎంత పని చేసింది.. అక్షయ్ కుమార్‌ను ఒదలని మహామ్మరి..

అక్షయ్ కుమార్ (Akshay Kuma/ Twitter)

చైనాతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. కోరానా ఎఫెక్ట్ కారణంగా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘ సూర్యవంశీ’ సినిమా విడుదలను వాయిదా వేశారు.

  • Share this:
    చైనాతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.  చైనాలో వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. కేవలం కరోనా వైరస్ చైనా దేశాన్నే కాదు..  ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. కరోనా ఎఫెక్ట్‌‌తో మన దేశంలో కూడా ఒకరు చనిపోయారు. తాజాగా ఈ ఎఫెక్ట్ అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ పై పడింది. ఆయన హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్,రణ్‌వీర్ సింగ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకుడు. ముందుగా షెడ్యూల్ చేసిన ప్రకారం ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేయాలనున్నారు. అయితే దేశ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తుండటంతో ఈ సినిమాను విడుదలను వాయిదా చేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ప్రకటన విడుదల చేసింది.


    ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ.. ఎంతో కష్టపడి అద్భుతమైన అనుభూతిని మీకు అందించేందుకు సూర్యవంశీ చిత్రాన్ని తీర్చిదిద్దాం. రీసెంట్‌గా విడుదైలన ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావాలని అనుకున్నాం. కానీ కోవిడ్ -19 (కరోనా వైరస్) విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకుల ఆరోగ్యాన్ని భద్రతను దృష్టిలో పెట్టుకొని ‘సూర్యవంశీ’ సినిమాను విడుదలను వాయిదా వేస్తున్నాం అంటూ ప్రకటించారు. మళ్లీ సరైన సమయంలో మళ్లీ రిలీజ్ డేట్ ప్రకటిస్తామన్నారు. మాకు మా  సినిమా కంటే ముందు ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యం. మీ ఉత్సుకతను అలాగే కొనసాగిస్తూ ప్రజలు ఆరోగ్య ఉండాలనేదే మా కోరిక అన్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: