Trump Corona: ఓరీ ట్రంప్..నీకు..కుక్క చావు ఖాయం...మూడేళ్ల క్రితమే తెలుగు వ్యక్తి శాపం..షాకింగ్...

నీ అంత్య కాలంలో నీ మరణ సమయంలో, నీ సన్నిహితులు గానీ, నీ మిత్రులు గానీ, నీ భార్య గానీ, నీ బంధువులుగానీ ఎవరూ లేకుండా, అనాధ లాగా కుక్క చావు చస్తావు. నా మాటకు తిరుగులేదు' అని శాపం పెట్టారు. సరిగ్గా మూడేళ్ల తర్వాత ఈ శాపం నిజం అవుతోందా...అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

news18-telugu
Updated: October 4, 2020, 10:18 PM IST
Trump Corona: ఓరీ ట్రంప్..నీకు..కుక్క చావు ఖాయం...మూడేళ్ల క్రితమే తెలుగు వ్యక్తి శాపం..షాకింగ్...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
  • Share this:
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా సోకి పరిస్థితి చాలా విషమంగా మారింది. అయితే ట్రంప్ పరిస్థితి ఇంతలా ఆందోళణ కరంగా మారడం వెనుక ఓ తెలుగు వ్యక్తి శాపమే కారణమా...అంటే అవుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సరిగ్గా మూడేళ్ల క్రితం అమెరికాలో కూఛిబొట్ల శ్రీనివాస్ అనే తెలుగు వ్యక్తి అమెరికా జాత్యహంకార దాడిలో బలైపోయిన సంగతి తెలిసిందే. ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే అనేక మంది భారతీయులపై వరుసగా జరిగాయి. అప్పుడు అలాంటి జాత్యహంకార దాడుల పట్ల దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందినవారిపై అమెరికాలో జరిగిన వరుస దాడులు అందరినీ కలవరపాటుకు గురిచేశాయి.

ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై స్పందించిన పంచాంగకర్త, ప్రముఖ సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు శాపనార్థాలు పెట్టారు. ట్రంప్ కుక్క చావు చస్తాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ జాతక చక్రం ప్రకారం ప్రస్తుతం ఆయనకు ఏలినాటి శని నడుస్తోందని, దీని ప్రభావం వల్ల ఆయన పూర్తికాలం పదవిలో కొనసాగలేరని జోస్యం చెప్పారు.

'ఓరీ జాత్యహంకారీ డొనాల్డ్ ట్రంప్.. నీవల్ల నిష్కారణంగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పాపం నీకు తప్పకుండా తగులుతుంది. నీవు చేసినటువంటి పాపాలకు ఫలితం చెబుతున్నా విను. ఇదే నీకు నేనిచ్చే శాపం. నీ అంత్య కాలంలో నీ మరణ సమయంలో, నీ సన్నిహితులు గానీ, నీ మిత్రులు గానీ, నీ భార్య గానీ, నీ బంధువులుగానీ ఎవరూ లేకుండా, అనాధ లాగా కుక్క చావు చస్తావు. నా మాటకు తిరుగులేదు' అని శాపం పెట్టారు. సరిగ్గా మూడేళ్ల తర్వాత ఈ శాపం నిజం అవుతోందా...అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.



తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన ములుగు సిద్ధాంతి గతంలో అనేక ప్రకృతి విపత్తులు, మహానేతల మరణాలను ముందుగానే ఊహించి తన పంచాంగంలో తెలిపారు.
Published by: Krishna Adithya
First published: October 4, 2020, 10:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading