క్లోరోక్విన్ వేసుకుంటే ఎంతో ఉల్లాసంగా...ఉత్సాహంగా ఉంది...ట్రంప్...

హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాత్కాలికంగా నిషేధించినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు పలుకుతున్నారు. ట్రంప్ గత రెండు వారాలుగా హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకుంటున్నారని, ఈ ఔ.షధం తీసుకున్న తర్వాత తనకు 'చాలా బాగుందని ట్రంప్ పేర్కొన్నట్లు వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

news18-telugu
Updated: May 29, 2020, 3:18 PM IST
క్లోరోక్విన్ వేసుకుంటే ఎంతో ఉల్లాసంగా...ఉత్సాహంగా ఉంది...ట్రంప్...
డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)
  • Share this:
కరోనాకు చెక్ పెడుతుందని భావిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాత్కాలికంగా నిషేధించినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు పలుకుతున్నారు. ట్రంప్ గత రెండు వారాలుగా హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకుంటున్నారని, ఈ ఔ.షధం తీసుకున్న తర్వాత తనకు 'చాలా బాగుందని ట్రంప్ పేర్కొన్నట్లు వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ట్రంప్ తాను కరోనా సోకిన వ్యక్తితో కలిసినట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే క్లోరోక్విన్ ఔషధాన్ని తీసుకుంటన్నట్లు వైట్ హౌస్ ప్రతినిధులు తెలిపారు.

ఇదిలా ఉంటే మలేరియా నివారణ, చికిత్స కోసం ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్, కోవిడ్ -19 చికిత్స కోసం యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) కూడా ఆమోదించలేదు, అయితే సంక్రమణకు సంబంధించి యుఎస్ ప్రభుత్వం క్లినికల్ ట్రయల్స్ జరుపుతోంది. కరోనా వైరస్‌ పోరులో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను 'డైస్ రివర్సింగ్' ఔషధంగా ట్రంప్ అభివర్ణించారు. మలేరియా నిరోధక మందులు తీసుకున్న తర్వాత ట్రంప్ ఎలా భావిస్తున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కేలీ మెకానియాను కొందరు విలేఖరులు ప్రశ్నించారు. అందుకు ఆమె ఆయనకు చాలా మంచి అనుభూతి కలిగిందని తెలిపింది.

అలాగే మెకాని మాట్లాడుతూ, కరోనా సంక్రమణను నివారించడంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకాన్ని చాలా మంది నిపుణులు సూచిస్తున్నారని నొక్కిచెప్పారు. 'సైన్స్ న్యూస్ డాట్.ఆర్గ్' లో టీనా హీస్మాన్ సే తన పరిశోధన గురించి పేర్కొంటూ కరోనా చికిత్సలో దీని ఉపయోగం గురించి ప్రపంచంలో సుమారు 200 మందికి పరీక్షలు జరిగాయని రాశారు. మిచిగాన్‌లోని హెన్రీ ఫోర్డ్ హాస్పిటల్‌లో 3 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు కూడా ఈ ఔషధాన్ని తీసుకుంటున్నారని, చాలా గొప్ప ఫలితాలు వస్తున్నట్లు తెలిపంది.

అంతేకాదు హైడ్రాక్సీక్లోరోక్విన్‌కు మద్దతుగా చాలా మంది వైద్యులు, పరిశోధకులు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఎవరైనా హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకోవాలనుకుంటే, వారు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం అని మెకాని పేర్కొన్నారు. 'న్యూయార్క్‌లోని ఒక ఎపిడెమాలజిస్ట్ మాట్లాడుతూ లక్షలాది మంది ప్రజలు ఈ ఔషధాన్ని చాలా కాలంగా ఉపయోగిస్తున్నారని ఇదేమీ కొత్తది కాదని ఆయన వాదన వినిపిస్తున్నారు.

మరోవైపు హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకముందే పరీక్షించమని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంతో సహా అనేక ఇతర సంస్థలు సలహా ఇచ్చాయి. ఒక అధ్యయనం ప్రకారం, కరోనా వైరస్ బారిన పడిన క్యాన్సర్ రోగులకు, మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. హైడ్రాక్సీక్లోరోక్విన్ క్యాన్సర్ రోగులకు చాలా ప్రమాదకరమని అమెరికన్ పరిశోధకులు తెలిపారు. ఈ ఔషధంతో క్యాన్సర్ చికిత్స పొందేవారు చనిపోయే అవకాశం మూడు రెట్లు ఎక్కువ అని పరిశోధకులు అంటున్నారు.

అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ హెడ్ డాక్టర్ హోవార్డ్ బురిడ్జ్, "హైడ్రాక్సీక్లోరోక్విన్ అలాగే యాంటీబయాటిక్ అజిథ్రోమైసిన్లతో కోవిడ్ 19 చికిత్స ప్రమాదకరం" అని తెలిపారు. ఇలా చేస్తే కరోనా బాధితుల్లో మిగిలినవారి కంటే మూడు రెట్లు ఎక్కువ చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
First published: May 29, 2020, 3:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading