గాంధీలోనూ కరోనా పరీక్షలు చేయండి... హైకోర్టు కీలక ఆదేశాలు

గాంధీ ఆస్పత్రిలో కలకలం... కరోనా పేషెంట్ మిస్సింగ్... ఎలా జరిగింది? (credit - twitter)

కరోనా చికిత్సకు రూ.4 లక్షలకు పైగా బిల్లు వేసిన యశోద, కిమ్స్‌ వంటి ప్రైవేట్ ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు. ప్రైవేటు కేంద్రాల్లో అన్ని రకాల పరీక్షలకు గరిష్ఠ ఛార్జీలను ఖరారు చేయాలని ఆదేశాలు జారీచేసింది.

 • Share this:
  రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరీక్షల తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు వేసింది. కరోనా పరీక్షలు, చికిత్స తీరుపై మంగళవారం విచారించిన హైకోర్టు.. గాంధీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గాంధీ ఆస్పత్రిలోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షల బిల్లులుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం కల్పించిన అధికారాలతో ప్రవేట్ ఆస్పత్రులను నియంత్రించాలని స్పష్టం చేసింది.

  అంతేకాదు కరోనా చికిత్సకు రూ.4 లక్షలకు పైగా బిల్లు వేసిన యశోద, కిమ్స్‌ వంటి ప్రైవేట్ ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు. ప్రైవేటు కేంద్రాల్లో అన్ని రకాల పరీక్షలకు గరిష్ఠ ఛార్జీలను ఖరారు చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఆస్పత్రుల్లోని బెడ్లు, వెంటిలేటర్ల వివరాలపై ఎప్పటికప్పుడు విస్తృత ప్రచారం చేయాలని సూచించింది. ఇక నాచారంలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేస్తున్నారని.. మరి చికిత్సలు చేస్తారో? లేదో? చెప్పాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో ఈ నెల 27లోపు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

  సోమవారం రాత్రి నాటికి.. తెలంగాణలో 36,221 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా నుంచి 23,679 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 365 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 12,178 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. సోమవారం నాటికి రాష్ట్రంలో 1,81,849 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
  Published by:Shiva Kumar Addula
  First published: