కరోనా వూహాన్ మాంసం మార్కెట్ నుంచి ప్రారంభం కాలేదు...సంచలన రిపోర్ట్...

కరోనా వైరస్ వ్యాప్తిపై పలువురు నిపుణులు, జీవశాస్త్రవేత్తలు విశ్లేషించారు. ప్రస్తుత పరిశోధణ ప్రకారం కరోనా సంక్రమణ అప్పటికే సోకిన వ్యక్తి ద్వారా మాంసం మార్కెట్‌కు చేరుకుందని అంచనా వేస్తున్నారు.

news18-telugu
Updated: May 17, 2020, 11:31 AM IST
కరోనా వూహాన్ మాంసం మార్కెట్ నుంచి ప్రారంభం కాలేదు...సంచలన రిపోర్ట్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చైనాలోని వుహాన్ మాంసం మార్కెట్ నుండి కరోనావైరస్ వ్యాపించలేదని ఒక కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది. వుహాన్ మాంసం మార్కెట్ నుండి కరోనా వైరస్ వ్యాపించిందనే చైనాపై ఆరోపణలు తలెత్తుతున్న వేళ ఈ వాదన తెరపైకి వచ్చింది. డైలీ మెయిల్‌ పత్రికలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, కరోనా వైరస్ వ్యాప్తిపై పలువురు నిపుణులు, జీవశాస్త్రవేత్తలు విశ్లేషించారు. ప్రస్తుత పరిశోధణ ప్రకారం కరోనా సంక్రమణ అప్పటికే సోకిన వ్యక్తి ద్వారా మాంసం మార్కెట్‌కు చేరుకుందని అంచనా వేస్తున్నారు. వైరస్ అప్పటికే ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాపించే లక్షణాలను కలిగి ఉందని నిపుణులు వెల్లడించారు.

ఈ కొత్త అధ్యయనంతో చైనాలోని లేబోరేటరీలో వైరస్ తయారు అయ్యిందనే ఆరోపణలు బలపడుతున్నాయి. చైనా ప్రభుత్వం వైరస్ గురించి సమాచారాన్ని దాచిపెడుతోందని, తప్పుడు ఆరోపణలు ఇస్తోందని ఇప్పటికే అమెరికా , సహా పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. కరోనా వైరస్‌పై చేసిన కొత్త అధ్యయనం దాని ఫలితాల గురించి స్పష్టంగా తెలుస్తుంది. ఈ పరిశోధన చేసిన మాలిక్యులర్ బయాలజిస్ట్ అలైనా చాన్ ఎవల్యూషనరీ బయాలజిస్ట్ షింగ్ హాన్ మాట్లాడుతూ, వైరస్ యొక్క జన్యు డేటాను గుర్తించడం ద్వారా, ఇది వుహాన్ యొక్క మాంసం మార్కెట్లో ఏ జంతువు నుండి వ్యాపించలేదని తెలుస్తుంది. ఈ అధ్యయనంలో, వైరస్ జంతువుల నుండి మానవులకు వ్యాపించే అన్ని అవకాశాలను ఖండించింది.

ప్రయోగశాలలో అధ్యయనం చేసేటప్పుడు జన్యుపరంగా ఇంజనీరింగ్ చేయని వైరస్, మనిషితో సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉందని అధ్యయనంలో తేల్చింది. ఈ అధ్యయనం తరువాత, వ్యాప్తికి గల కారణాలపై అంతర్జాతీయ దర్యాప్తు కోసం డిమాండ్ బలపడింది. కరోనా వైరస్‌కు సంబంధించిన విషయాలను బయట పెట్టాలని అమెరికా విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడు అన్నారు. కరోనా మూలాలు వెతకాలి. వైరస్ ఎలా వ్యాపిస్తుందో మనం తెలుసుకోవాలి? వైరస్ వ్యాప్తిలో చైనా పాత్ర ఏమిటి అనేది త్వరలోనే బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అంటువ్యాధికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి మరియు దానికి నివారణను కనుగొనడానికి వైరస్‌ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్‌కు సంబంధించి చైనాపై తీవ్రమైన ఆరోపణలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే వుహాన్ ల్యాబ్‌లో గబ్బిలాలపై ప్రయోగం సందర్భంగా కరోనా వైరస్ వ్యాపించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఆరోపణ చేయగా. క్రీడా పోటీల కోసం చైనాకు వచ్చిన అమెరికన్ సైనికుల ద్వారా ఈ వైరస్ వ్యాపించిందని చైనా ఆరోపించింది.
Published by: Krishna Adithya
First published: May 17, 2020, 11:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading