శ్రీశైలంలో కరోనా టెన్షన్.. నేటి నుంచి భక్తుల దర్శనాలు నిలిపివేత

శ్రీశైలంలోని సున్నిపెంటలో ఇప్పటి వరకు 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 13 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. బాధితుల్లో పలువురు ఆలయ సిబ్బంది కూడా ఉన్నారు.

news18-telugu
Updated: July 15, 2020, 7:12 AM IST
శ్రీశైలంలో కరోనా టెన్షన్.. నేటి నుంచి భక్తుల దర్శనాలు నిలిపివేత
శ్రీశైలం ఆలయం
  • Share this:
శ్రీశైలంలో కరోనా కేసులు టెన్షన్ రేపుతున్నాయి. స్థానికులతో పాటు పలువురు ఆలయ సిబ్బంది కూడా కరోనా బారినపడడంతో ఆలయ ఈవబో కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి వారం రోజుల పాటు భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి ఆలయంలో భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయంలో పనిచేసే ఇద్దరు పరిచారికలు, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడంతో ఆలయ మూసివేత నిర్ణయాన్ని తీసుకున్నారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

శ్రీశైలంలోని సున్నిపెంటలో ఇప్పటి వరకు 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 13 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. బాధితుల్లో పలువురు ఆలయ సిబ్బంది కూడా ఉన్నారు. ఐతే భక్తుల దర్శనాలను నిలివేసినప్పటికీ.. స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలు, ఇతర సేవలు యథాతథంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో వెల్లడించారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే వారం పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కాగా, శ్రీశైల ఆలయమున్న కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 3,823 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో ఇప్పటి వరకు 33,019 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా నుంచి 17,467 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 408 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 15,144 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక పరీక్షల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 22,670 శాంపిల్స్ పరీక్షించగా.. 1,916 మందికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11,95,766 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది
Published by: Shiva Kumar Addula
First published: July 15, 2020, 7:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading