60వేలు దాటిన కరోనా మరణాలు... 11లక్షలకు పైగా కేసులు...

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణాలు 60వేలు దాటాయి. ఇప్పటి వరకు కరోనా వల్ల 62,399 మంది చనిపోయారు.

news18-telugu
Updated: April 4, 2020, 11:18 PM IST
60వేలు దాటిన కరోనా మరణాలు... 11లక్షలకు పైగా కేసులు...
కరోనా (WHO Website)
  • Share this:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణాలు 60వేలు దాటాయి. ఇప్పటి వరకు కరోనా వల్ల 62,399 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 11,59,953 మంది కరోనా బారిన పడగా, అందులో 62,399 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,41,630 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రపంచంలో అత్యధికంగా 2,91,545 కరోనా బాధితులు ఉన్నారు. ఒక్కరోజే 14,384 కరోనా బారిన పడ్డారు. ఇప్పటి వరకు అమెరికాలో 7,851 మంది కరోనా వల్ల చనిపోయారు. ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు స్పెయిన్‌లో నమోదయ్యాయి. అక్కడ 11744 మంది కరోనా వల్ల చనిపోయారు. స్పెయిన్‌లో 124736 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇటలీలో కూడా దాదాపుగా స్పెయిన్‌లో ఉన్నంత మందే (124632) కరోనా కేసులు ఉన్నాయి. మరణాల సంఖ్య మాత్రం 15,362 గా నమోదైంది. ఈ ఒక్కరోజే ఇటలీలో 681 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీ తర్వాత స్థానంలో జర్మనీ, ఫ్రాన్స్, చైనా (81639) కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 3082 కాగా, అందులో 86 మంది చనిపోయారు.
First published: April 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading