యూరప్‌లో కరోనా మహమ్మారి పంజా విసరుతోంది. ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్, యూకే, ఫ్రాన్స్ దేశాల్లో కరోనా కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. ఆయా దేశాల్లో జనం పిట్టల్లా రాలుతున్నారు. ఇక స్పెయిన్‌లో కరోనా మరణాల సంఖ్య 10వేలు దాటింది. రాత్రికి రాత్రే ఏకంగా 950 మంది చనిపోయారని స్పెయిన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. స్పెయిన్‌లో ఇప్పటి వరకు 1,10,238 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు కాగా.. 26,743 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇక కరోనా బారినపడి 10,003 కన్నుమూశారు. మరణాల సంఖ్యలో ఇటలీ అగ్రస్థానంలో ఉండగా.. స్పెయిన్ రెండో స్థానలో ఉంది.
Spain's coronavirus death toll tops 10,000 after a record 950 people died overnight, reports Reuters quoting Spain's Health Ministry pic.twitter.com/VUBb8oy2wS
— ANI (@ANI) April 2, 2020
ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 203 దేశాలు, ప్రాంతాలకు ఈ మహమ్మారి విస్తరించింది. ఇప్పటి వరకు 951,933 పాజిటివ్ కేసులు నమోదవగా.. 202,888 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 48,320 మంది మరణించారు. రేపు ఈ సంఖ్య 50వేలకు చేరుకునే అవకాశముంది. ఇటలీలో 13,155 మంది, స్పెయిన్‌లో 10,003, అమెరికాలో 5,113, ఫ్రాన్స్‌లో 4,032 , చైనాలో 3,318 మంది చనిపోయారు. ఇక పాజిటివ్ కేసుల్లో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది అమెరికా. అక్కడ ఇప్పటి వరకు 215,357 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికాలో రాబోయే రోజుల్లో లక్ష వరకు మరణాలు నమోదు కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, Spain