మహారాష్ట్రలో వెయ్యి మందికి పైగా కరోనా బాధితులు మృతి

గడిచిన 24 గంటల్లో ముంబైలో 998 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 25 మంది చనిపోయారు.

news18-telugu
Updated: May 14, 2020, 8:30 PM IST
మహారాష్ట్రలో వెయ్యి మందికి పైగా కరోనా బాధితులు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రలో కరోనావైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. అక్కడ కరోనా మరణాల సంఖ్య వెయ్యి దాటింది. గురువారం భారీ మొత్తంలో కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1602 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 44 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 27,524కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 6059 మంది కోలుకోగా.. 1019 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 20,441 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదైన విషయం తెలిసిందే.

మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ముంబైలో 998 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 25 మంది చనిపోయారు. తాజా కేసులతో ముంబైలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,377కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 4234 మంది కోలుకోగా.. 621 మంది మరణించారు.


అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 3,722 కొత్త కేసులు నమోదవగా.. 134 మంది మరణించారు. మనదేశంలో ఇప్పటి వరకు 78,003 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 26,235 మంది కోలుకోగా.. 2,549 మంది మరణించారు. ప్రస్తుతం భారత్‌లో 49,219 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
First published: May 14, 2020, 8:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading