Telangana CMRF: తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వండి ఇలా

Telangana Chief Minister Relief Fund | తెలంగాణ సీఎంఆర్ఎఫ్‌కు విరాళాల వెల్లువ మొదలైంది. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఇ-గరవ్నెన్స్ ప్లాట్‌ఫామ్ మీసేవ ద్వారా విరాళాల సేకరణ కొనసాగుతోంది.

news18-telugu
Updated: March 27, 2020, 12:57 PM IST
Telangana CMRF: తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వండి ఇలా
సీఎం కేసీఆర్(ఫైల్)
  • Share this:
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా కష్టాలు ఎదుర్కొంటున్న పేదలు, చిరుద్యోగులను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో మీరూ చేతులు కలపాలనుకుంటున్నారా? కరోనా వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మీరూ మద్దతుగా నిలవాలనుకుంటున్నారా? మీ వంతు సాయం చేసి మానవత్వాన్ని చాటుకోవాలనుకుంటున్నారా? మీరు నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వొచ్చు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యల్ని మొదలుపెట్టింది. తెలంగాణ సీఎంఆర్ఎఫ్‌కు విరాళాల వెల్లువ మొదలైంది. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఇ-గరవ్నెన్స్ ప్లాట్‌ఫామ్ మీసేవ ద్వారా విరాళాల సేకరణ కొనసాగుతోంది.


తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి సినీనటులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. నేరుగా ముఖ్యమంత్రిని కలిసి విరాళాలు ఇచ్చేవారు ఇస్తున్నారు. మరికొందరు మీసేవ ద్వారా విరాళాలు ఇస్తున్నారు. మీరు కూడా తెలంగాణ సీఎంఆర్ఎఫ్‌కు విరాళాలు ఇవ్వొచ్చు. https://ts.meeseva.telangana.gov.in/Covid/CovidContribution.htm వెబ్‌సైట్‌లో మీ విరాళాలను ఇవ్వొచ్చు. వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



తెలంగాణ సీఎంఆర్ఎఫ్‌కు విరాళాలు ఇవ్వడంలో మీకు ఏవైనా సమస్యలు ఉంటే meesevasupport@telangana.gov.in ఇమెయిల్ ఐడీ లేదా, 9121006471/ 9121006472 వాట్సప్ నెంబర్లను సంప్రదించొచ్చు.ఇవి కూడా చదవండి:

Good News: లోన్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్... భారీగా తగ్గనున్న ఈఎంఐలు

PM Gareeb Kalyan: పీఎం గరీబ్ కళ్యాణ్ స్కీమ్‌తో లాభాలు వీళ్లకే

ATM: ఏటీఎంకు వెళ్లకుండా ఇంటికే డబ్బులు తెప్పించుకోండి ఇలా...

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టేందుకు డబ్బులు లేవా? ఇలా చేయండి
First published: March 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading