గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ మృతి.. డాక్టర్లపై కుటుంబ సభ్యుల దాడి

పరిస్థితి విషమించడంతో అతడు చనిపోయినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ తెలిపారు. ఐతే అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు వైద్యులపై దాడి చేశారని వెల్లడించారు.

news18-telugu
Updated: April 1, 2020, 8:58 PM IST
గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ మృతి.. డాక్టర్లపై కుటుంబ సభ్యుల దాడి
గాంధీ ఆస్పత్రి
  • Share this:
తెలంగాణలో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఆరుగురు చనిపోగా.. తాజాగా గురువారం గాంధీ ఆస్పత్రిలో మరో కరోనా బాధితుడు మరణించాడు. పరిస్థితి విషమించడంతో అతడు చనిపోయినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ తెలిపారు. ఐతే అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు వైద్యులపై దాడి చేశారని వెల్లడించారు. అతడి మరణాన్ని జీర్ణించుకోలేక ఆగ్రహంతో వైద్యులపై విరుచుకుపడ్డానని... కష్ట సమయంలో డాక్టర్ల పట్ల ఇలా వ్యవహరించడం సరికాదన్నారు శ్రవణ్. ఈ ఘటనపై పోలీసులతో పాటు వైద్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పోలీసులు మొదట లైట్‌గా తీసుకున్నారని.. సీపీ అంజనీకుమార్ వచ్చాకే వారిలో చలనం వచ్చిందని ఆయన తెలిపారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి ఈటల రాజేందర్‌కు డాక్టర్లు విజ్ఞప్తి చేశారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టామని అధికారులు చెప్పారు. ఇక వైద్యులపై దాడి చేసిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రి నుంచి చెస్ట్ ఆస్పత్రికి షిప్ట్ చేశారు. కాగా, మృతుడితో పాటు డాక్టర్లపై దాడి చేసిన అతడి సోదరుడు ఇటీవల ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు హాజరయ్యారని అధికారులు ధృవీకరించారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీరికి కరోనా సోకినట్లు స్పష్టం చేశారు. డాక్టర్లపై దాడిని మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

గాంధీ హాస్పిటల్ లో డాక్టర్ ల పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితిలో క్షమించం. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము.డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే వారిని కొట్టడం ఏంటి? డాక్టర్స్ మీద దాడి చేయడం హేయమైన చర్య. ఇలాంటి గంభీరమైన సమయంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదు. 24 గంటలు డాక్టర్లు ప్రజల కోసం పని చేస్తున్నారు.వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ప్రతి డాక్టర్ కి రక్షణ కల్పిస్తాం. భరోసాతో పని చేయండి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాము.
ఈటల రాజేందర్, మంత్రి


తాజా మరణంలో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 7కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 97 కేసులు నమోదవగా.. 77 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ్టి కరోనావైరస్ బులెటిన్ విడుదల కావాల్సి ఉంది.
First published: April 1, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading