Home /News /coronavirus-latest-news /

CORONAVIRUS COVID TESTS PRICE SHOULD E SAME IN ENTIRE COUNTRY SAYS SUPREME COURT SK

కరోనా పరీక్షలకు దేశమంతా ఒకే ధరలు: సుప్రీంకోర్టు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అన్ని రాష్ట్రాల్లో కరోనా రోగుల వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది.

    కరోనా రోగులకు చికిత్సపై కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. కేసును సుమోటోగా తీసుకొని జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం విచారిస్తోంది. ఐతే ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న చికిత్స తీరు, కరోనా పరీక్షలపై ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. తాజాగా కరోనా పరీక్షల ధరలపైనా కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా చికిత్స ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నాయని.. దేశమంతటా ధరల ఒకేలా ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

    పలు రాష్ట్రాల్లో తక్కవ ధరకే కరోనా టెస్ట్‌లు చేస్తున్నారన్న ధర్మాసనం.. ఆ ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాదు అన్ని రాష్ట్రాల్లో కరోనా రోగుల వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని LNJP ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడాన్ని ప్రస్తావించింది. కరోనా వార్డుల్లో సీసీ కెమెరాలను నిత్యం పర్యవేక్షించడం ద్వారా కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందుతుందని కోర్టు అభిప్రాయపడింది.

    First published:

    Tags: Coronavirus, Covid-19, Supreme Court

    తదుపరి వార్తలు