Home /News /coronavirus-latest-news /

గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితురాలు ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితురాలు ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

గాంధీ ఆస్పత్రి

గాంధీ ఆస్పత్రి

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 10 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇవాళ మరో 34 మంది డిశ్చార్జ్ అయ్యారు.

    తెలంగాణలో కొత్త కరోనా కేసులు క్రమంగా తగ్గముఖం పడుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు కూడా కోలుకుంటున్నారు. ఈ క్రమంలో కరోనా బాధితురాలు గాంధీ ఆస్పత్రిలో ప్రసవించింది. కరోనా వైరస్ సోకిన గర్భిణీకి వైద్యులు సిజేరియన్ చేశారని.. ఆమె పండండి మగబిడ్డకు జన్మనిచ్చిందని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఐతే తల్లి నుంచి బిడ్డకు సోకిందా అన్నది తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో శిశువుకు కూడా కరోనా పరీక్షలు చేస్తామని మంత్రి ఈటల చెప్పారు. అంతేకాదు విషమ పరిస్థితిలో ఉన్న 75 ఏళ్ల వృద్ధుడు కూడా కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యాడని తెలిపారు. చనిపోతాడనుకున్న ఓ డయాలిసిస్ పేషెంట్ సైతం కోలుకున్నట్లెు చెప్పారు. ఇది గొప్ప విజయమని.. గాంధీ ఆస్పత్రి వైద్యులు అంత బ్రహ్మాండంగా చికిత్స చేస్తున్నారని ప్రశంసించారు ఈటల రాజేందర్.

    కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 10 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇవాళ మరో 34 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో తెలంగాణ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1132కు చేరింది. మొత్తం బాధితుల్లో 727 మంది బాధితులు కోరుకోగా.. ఇప్పటి వరకు 29 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 376 యాక్టివ్ కేసులున్నాయి. వారంతా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, Covid-19, Gandhi hospital, Telangana

    తదుపరి వార్తలు