Covid-2019 : ఆగని కోవిడ్ వైరస్... 1700 దాటిన మృతుల సంఖ్య... చైనాలో కొత్త కరెన్సీ...

Covid-2019 | Corona Virus : తమ దేశంలో కోవిడ్ (కరోనా) వైరస్ కొత్తగా సోకుతున్న వారి సంఖ్య తగ్గుతోందని చైనా చెబుతుండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది.

news18-telugu
Updated: February 17, 2020, 6:55 AM IST
Covid-2019 : ఆగని కోవిడ్ వైరస్... 1700 దాటిన మృతుల సంఖ్య... చైనాలో కొత్త కరెన్సీ...
Coronavirus
  • Share this:
Covid-2019 | Corona Virus : ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 దేశాల్లో కోవిడ్ వైరస్ విస్తరించిన సమయంలో... చైనా ఓ సంతోషకరమైన విషయం చెప్పింది. మూడు రోజులుగా తమ దేశంలో కొత్తగా కరోనా వైరస్ సోకుతున్న వారి సంఖ్య తగ్గుతోందని తెలిపింది. అదే నిజమైతే... త్వరలోనే ఈ వైరస్ పూర్తిగా వెళ్లిపోయే అవకాశాలుంటాయి. ప్రస్తుతం మృతుల సంఖ్య 1700 దాటింది. ఐతే... మృతుల్లో ఎక్కువ మంది... చైనాలోని వుహాన్ నగరంలో... వ్యాధి ప్రారంభమైన హుబేలోనే చనిపోతున్నారు. కొత్తగా 1843 మందికి ఈ వ్యాధి సోకగా... ఆల్రెడీ 68000 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో మరో 500 మంది ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. మన దేశం మాత్రం కరోనా వైరస్ విషయంలో ఎంతో జాగ్రత్త పడుతోంది. విదేశాల నుంచీ వచ్చే వారిని పూర్తి తనిఖీలు చేసిన తర్వాత ఇండియాలోకి అనుమతిస్తోంది. అందువల్ల భారతీయులు ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు అధికారులు.




వైరస్‌ని తగ్గించేందుకు చైనా ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఇవాళ్టి నుంచీ డీమానెటైజేషన్ చేస్తోంది. తద్వార ఎవరైనా ప్రస్తుతం ఉన్న కరెన్సీని బ్యాంకులో ఇస్తే... కొత్త కరెన్సీ నోట్లను ఇస్తుంది. ఈ పాత నోట్లను పారేయకుండా... ఓ చోట దాచిపెట్టబోతోంది. వాటిని రెండు వారాలపాటూ అలా ఉంచితే... ఆటోమేటిక్‌గా వాటిపై ఉన్న కొవిడ్ వైరస్ చనిపోతుంది. ఇలా చెయ్యడం వల్ల ఇప్పటికే కరోనా వైరస్ ఉన్న కరెన్సీ నోట్ల వల్ల ఇతరులకు వైరస్ సోకకుండా ఉంటుందని చైనా ప్రభుత్వం చెబుతోంది. 14 రోజుల తర్వాత వాటిని తిరిగి ప్రజల్లోకి వదలనుంది చైనా సెంట్రల్ బ్యాంక్.


ఇక జపాన్‌లో నిలిపివేసిన నౌకలో ప్రయాణించిన తమ దేశ ప్రజలను వెనక్కి పిలిపించుకుంటున్నాయి అమెరికా సహా ప్రపంచ దేశాలు. ఈ నౌకలో ప్రయాణించిన చాలా మందికి కరోనా వైరస్ సోకింది. వాళ్లను క్వారంటైన్ వార్డుల్లో ఉంచి పరీక్షిస్తున్నారు. ఐతే... తాజాగా ఫ్రాన్స్‌లో ఓ చైనా వాసి కరోనా వైరస్‌తో చనిపోవడంతో... యూరప్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు చైనాతో ఎగుమతులు, దిగుమతులను చాలా దేశాలు నిలిపివేస్తుండటంతో... అంతర్జాతీయంగా వాణిజ్యం దెబ్బతింటోంది. పర్యాటక, వైమానిక, హోటల్, ఆటోమొబైల్‌, స్మార్ట్ ఫోన్లతోపాటూ... చాలా రంగాలు నష్టాల్లోకి జారుకుంటున్నాయి.
First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు