శవాల మధ్యనే కరోనా రోగులకు చికిత్స.. షాకింగ్ వీడియో

కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు ముందుకు రావడం లేదని చెప్పారు. ఈ క్రమంలోనే శవాలను ప్యాక్ చేసి ఆస్పత్రి బెడ్లపై ఉంచినట్లు ఆయన తెలిపారు.

news18-telugu
Updated: May 7, 2020, 2:56 PM IST
శవాల మధ్యనే కరోనా రోగులకు చికిత్స.. షాకింగ్ వీడియో
ఆస్పత్రిలో శవాల పక్కనే రోగులకు చికిత్స
  • Share this:
కరోనా వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా జనం పిట్టల్లా రాలుతున్నారు. భారత్‌లోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. మనదేశంలో ముంబై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎక్కవ మంది బాధితులు ఇక్కడ ఉన్నారు. ఈ క్రమంలో ముంబైలోని ఓ కరోనా ఆస్పత్రిలో షాకింగ్ ఘటన వెలుగోకి వచ్చింది. శవాల మధ్యే కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. బృహన్ ముంబై కార్పొరేషన్ (BMC) ఆధ్వర్యంలో నడిచే సియాన్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఆస్పత్రి బెడ్లపై ప్లాస్టిక్ కవర్‌లో శవాలను ప్యాక్ చేసిి ఉన్నాయి. అదే రూమ్‌లో పక్క బెడ్‌లపైనే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. కరోనా మృతదేహాల మధ్య కరోనా ఐసోలేషన్ వార్డును నిర్వహిస్తున్నారు.

ఈ ఘటనపై బీజేపీ నేత తీవ్ర విమర్శలు గుప్పించారు. సియాన్‌ ఆస్పత్రిలో శవాల పక్కనే కరోనా రోగులు నిద్రిస్తున్నారని.. మరీ ఇంత ఘోరమా అని ఆయన మండిపడ్డారు. ఇదే పాలన.. సిగ్గుపడండి.. అంటూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మృతదేహాలకు ప్రొటోకాల్ ప్రకారం ప్రత్యేక సంచుల్లో ప్యాక్ చేయాలని.. కానీ అలాంటివేమీ ఇక్కడ లేవని ఆయన పేర్కొన్నారు. దీనిపై బీజేపీ ICMRకి లేఖరాసినట్లు చెప్పారు.

ఐతే అది ఫేక్ వీడియోగా మొదట కొట్టిపారేసిన ఆస్పత్రి వర్గాలు.. ఆ తర్వాత ధృవీకరించాయి. దీనిపై ఆస్పత్రి డీన్ ప్రమోద్ మాట్లాడుతూ... కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు ముందుకు రావడం లేదని చెప్పారు. ఈ క్రమంలోనే శవాలను ప్యాక్ చేసి ఆస్పత్రి బెడ్లపై ఉంచినట్లు ఆయన తెలిపారు. సియోన్‌ ఆస్పత్రిలోని 15 స్లాట్లలో 11 పూర్తిగా నిండిపోయాని చెప్పారు. తాము మార్చురీకి తరలించే లోపే ఈ వీడియోను తీసి ఉంటారని.. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని స్పష్టం చేశారు.

కాగా, మహారాష్ట్రలో ఇప్పటి వరకు 16,758 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 3,094 మంది కోలుకోగా.. 651 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,013 యాక్టివ్ కేసులున్నాయి.

First published: May 7, 2020, 2:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading