శ్రీకాళహస్తిలో సంపూర్ణ లాక్‌డౌన్.. ఏమేం చేయకూడదంటే..

శ్రీకాళహస్తిలో సంపూర్ణ లాక్‌డౌన్.. ఏమేం చేయకూడదంటే..

శ్రీకాళహస్తి

నిత్యావసర సరుకులు, మందులను నేరుగా ఇళ్లకే డోర్ డెలివరీ చేస్తామని చెప్పారు. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 • Share this:
  ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. టెస్ట్‌ల సంఖ్య పెరగడంతో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఐతే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఇటీవల ఎక్కువ మంది కరోనా బారిన పడుతుండడంతో జిల్లా అధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి శ్రీకాళహస్తి పట్టణంలో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తామని ప్రకటించారు. కేసుల తీవ్రత దృష్ట్యా పట్టణంలో లాక్‌డౌన్‌ సడలింపులు ఉండబోవని స్పష్టం చేశారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జిల్లా కలెక్టర్‌ భరత్‌గుప్తా, తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేశ్‌రెడ్డి ప్రజలకు సూచించారు. నిత్యావసర సరుకులు, మందులను నేరుగా ఇళ్లకే డోర్ డెలివరీ చేస్తామని చెప్పారు. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  గురువారం ఉదయం వచ్చిన ఏపీ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం..రాష్ట్రంలో కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి. వీటిలో కర్నూలు 31, అనంతపురం 6, చిత్తూరు 14, తూర్పు గోదావరి 6, గుంటూరు 18, కృష్ణా 2, ప్రకాశం 2, విశాఖపట్నంలో ఒక కేసు ఉన్నాయి. దాంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 893కు చేరింది. వీరిలో 141 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 725గా ఉంది. కరోనా కారణంగా ఏపీలో ఇప్పటివరకు 27 మంది చనిపోయారు. రాష్ట్రంలో 893 కరోనా కేసులుండగా.. 590 కేసులు కర్నూలు, గుంటూరు, క్రిష్ణ, చిత్తూరు జిల్లాల్లోనే ఉన్నాయ. మొత్తంగా 66 శాతం మంది కరోనా బాధితులు ఈ నాలుగు జిల్లాల్లోనే ఉన్నారు.

  ఏపీలో ప్రస్తుతం 573 మండలాలు గ్రీన్ జోన్‌.. మరో 47 మండలాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయని ఏపీ వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. భారతదేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు చేసిన రాష్ట్రంగా ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందన్న ఆయన.. పరీక్షలు నిర్వహించడం లేదన్న విమర్శలు సరికావని అన్నారు. ఏపీలో 9 ల్యాబ్స్‌లో కరోనా పరీక్షలు చేస్తున్నారు. ర్యాపిడ్ కిట్ల రావడంతో పరీక్షలను మరింత వేగవంతంగా చేయగలుగుతున్నామని చెప్పారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు