కరోనా వెనుక గ్రహాంతర వాసుల కుట్ర...సాధ్యమే అంటున్న నాసా...

కరోనా వైరస్ ఒక తోకచుక్క ద్వారా భూమ్మీదకు వచ్చిందని అక్టోబర్ 2019 లో చైనాలో భూభాగం పైకి అంతరిక్ష శిల వచ్చి ఉండవచ్చని అంచనా వేశారు. వైరస్ లను మోసుకొచ్చే తోకచుక్కలు గతంలో కూడా వచ్చాయని ఆయన వాదన వినిపిస్తున్నారు.

news18-telugu
Updated: April 18, 2020, 2:24 PM IST
కరోనా వెనుక గ్రహాంతర వాసుల కుట్ర...సాధ్యమే అంటున్న నాసా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనావైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంతో, ప్రజలంతా అసలు ఈ వైరస్ ఇంత కొరకరాని కొయ్యగా ఎలా మారిందా అని భయపడుతున్నారు. అటు కరోనా గురించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసకుంటూ ప్రపంచ దేశాలు ఆడిపోసుకుంటున్నాయి. అయితే తాజాగా మరో సిద్ధాంతం వ్యాప్తిలోకి వచ్చింది. అదేంటంటే కరోనా వైరస్ అంతరిక్షం నుంచి వచ్చిందని, అందుకే మానవ శాస్త్ర సాంకేతికతకు ఏ మాత్రం లొంగడం లేదని వాదనకు బలం చేకూరుతోంది. సుప్రసిధ్ధ ఆస్ట్రోబయాలజీ నిపుణుడు, శాస్త్రవేత్త చంద్ర విక్రమాసింఘే, వైరస్ ఒక తోకచుక్క ద్వారా భూమ్మీదకు వచ్చిందని అక్టోబర్ 2019 లో చైనాలో భూభాగం పైకి అంతరిక్ష శిల వచ్చి ఉండవచ్చని అంచనా వేశారు. వైరస్ లను మోసుకొచ్చే తోకచుక్కలు గతంలో కూడా వచ్చాయని ఆయన వాదన వినిపిస్తున్నారు.

గతంలో, విక్రమసింఘే అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS) కూడా అంతరిక్షం నుండి వచ్చిందని నొక్కిచెప్పారు. ఆయన 1970లోనే ఫ్రెడ్ హోయల్‌తో కలిసి "డిసీజెస్ ఫ్రమ్ స్పేస్" అనే పుస్తకాన్ని సహ రచయితగా ఉన్నారు. అలాగే దశాబ్దాలుగా, SARS లాంటి వ్యాధులు అంతరిక్షం నుండి వచ్చాయని నిరూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏదేమైనా కరోనా వెనుక గ్రహాంతర మూలాలు ఉండవచ్చని విక్రమసింఘే నొక్కి చెబుతున్నారు. అయితే ఒక వైరస్ అంతరిక్షంలో ఇంత సుదీర్ఘ దూరం ప్రయాణించి ఇంత రేడియేషన్ తట్టుకొని భూమిపై మానవులకు సోకగలదా అనే కొందరు సైంటిస్టులు సందేహం వ్యక్తం చేశారు. మరోవైపు నాసాకు చెందిన ప్రముఖ ఆస్ట్రోబయాలజిస్ట్ గ్రాహం లా మాత్రం విక్రమ సింఘే వాదనలు తోసిపుచ్చడం లేదు. అయితే విక్రమసింఘే వాదనలకు మద్దతు ఇవ్వడానికి ఆధారాలు లేవని గ్రాహం అంటున్నారు.

అయితే విక్రమసింఘే వాదనకు పాన్స్పెర్మియా సిద్ధాంతం బలం ఇస్తోంది. భూమిపై జీవం అనేది బాహ్య అంతరిక్షం నుంచి వచ్చిన జీవసంబంధమైన పదార్థాల సహాయంతో ఉద్భవించిందని నిరూపించిన సిద్ధాంతమే పాన్స్‌పెర్మియా. అయితే ఖచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ, సిద్ధాంతపరంగా, ఇలా జరగవచ్చు అని గ్రాహం లా అన్నారు. సిద్ధాంతపరంగా, జీవ పదార్థాలు అంతరిక్ష శిల మీద జీవించగలవు, గతంలో కొన్ని అంతరిక్ష శిలల్లో అమైనో ఆమ్లాలు వంటి సేంద్రీయ అణువులను కనుగొన్నారు. ఏదేమైనా, సైద్ధాంతిక అవకాశాలు ఉన్నప్పటికీ, కొత్త కరోనావైరస్ బాహ్య అంతరిక్షం నుండి వచ్చినట్లు చూపించడానికి నమ్మదగిన ఆధారాలైతే ప్రస్తుతానికి లేవు.
Published by: Krishna Adithya
First published: April 18, 2020, 2:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading