హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

షాకయ్యా.. ఏపీలో వైన్‌షాప్‌లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

షాకయ్యా.. ఏపీలో వైన్‌షాప్‌లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

మద్యం షాపుల మందు బారులు తీరిన ప్రజలు

మద్యం షాపుల మందు బారులు తీరిన ప్రజలు

ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1650కి చేరింది. అటు.. 524 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 33 మంది మరణించారు.

  ఏపీలో దాదాపు 40 రోజుల తర్వాత వైన్ షాప్‌లు తెరచుకున్నాయి. లాక్‌డౌన్ 3పై కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో మద్యం దుకాణాలను తెరిచారు. ఇన్ని రోజుల తర్వాత వైన్ షాప్‌లు ఓపెన్ కావడంతో మద్యం బాబుల ఆనందానికి అవధులు లేవు. రేట్లు పెంచినప్పటికీ మద్యం కోసం ఎగబడుతున్నారు. ఏపీలో ఉదయం నుంచే వైన్ షాప్‌లకు జనాల తాకిడి పెరిగింది. కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర క్యూ లైన్‌లు కనిపిస్తున్నాయి. మండుటెండలను కూడా లెక్కల చేయకుండా ఒక్క సీసా మందు కోసం కష్టపడుతున్నారు మద్యం ప్రియులు. పలు చోట్ల మందుబాబు సామాజిక దూరం పాటించడం లేదు. వందలాది మంది ఒక్క చోట చేరి గుంపులు గుంపులుగా చేరారు.

  ఏపీలో వైన్‌షాపుల వద్ద క్యూలైన్‌లపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. మద్యం దుకాణాల వద్ద పరిస్థితిని చూసి షాక్ తిన్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. జనాల పెద్ద ఎత్తున తరలివస్తారని తెలిసి కూడా... సరైన చర్యలు తీసుకోలేదని సీఎం జగన్‌పై మండిపడ్డారు. ఇలాంటి ఘటనల వల్ల ఏపీలో కరోనా కేసులు మరింత పెరిగే ప్రమాదముందని ఆయన అన్నారు.


  కాగా, ఏపీలో కరోనా కేసులు మరింత పెరిగాయి. నిన్న ఉదయం నుంచి ఈ రోజు వరకు.. కేవలం 24 గంటల్లోనే కొత్తగా 67 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 10,292 సాంపిల్స్ ని పరీక్షించగా 67 మంది కరోనా వచ్చినట్లు తేలింది. చిత్తూరులో 1, గుంటూరులో 19, కడపలో 4, కృష్ణాలో 12, కర్నూలులో 25, విశాఖపట్నంలో 6 కొత్త కేేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1650కి చేరింది. అటు.. 524 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 33 మంది మరణించారు. ప్రస్తుతం 1093 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu naidu, Coronavirus, Liquor shops, Wine shops

  ఉత్తమ కథలు