గాంధీ ఆస్పత్రిలో కేంద్రం బృందం.. కరోనా చికిత్స, వసతులపై ఆరా

గాంధీ ఆస్పత్రి

తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1001 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనాతో పోరాడుతూ 316 మంది కోలుకోగా.. 15 మంది మరణించారు.

  • Share this:
    రాష్ట్రంలో పర్యటిస్తున్న అంతర్ మంత్రిత్వ కేంద్రం బృందం సోమవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించింది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో వైద్యసేవలు, వసతులు, అందుబాటులో ఉన్న శానిటేషన్ సిబ్బంది, పారామెడికల్, సిబ్బంది, సెక్యూరిటీ, వార్డు బాయ్స్ పనితీరు, పి పి ఈ లు మెడిసిన్స్ లభ్యత గురించి డాక్టర్లు, అధికారులను ఆరా తీశారు. గాంధీ హాస్పిటల్‌లో ఉన్న బెడ్స్, ఐసియు బెడ్స్, వెంటిలేటర్లు తదితర అంశాలను వాకబు చేశారు. వైద్యులు, ఇతర సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. చికిత్స పొందుతున్న కేసులలో 90% మంది ఆరోగ్య స్థితి నిలకడగానే ఉంని.. సిబ్బంది కొరత లేదని తెలిపారు.

    కాగా, రాష్ట్రంలో IMCT మూడో రోజు పర్యటిస్తున్నారు. ఇప్పటికే కరోనా రెడ్‌జోన్లలో పర్యటించి లాక్‌డౌన్ అమలు తీరును పరిశీలించారు. ఇక తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1001 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనాతో పోరాడుతూ 316 మంది కోలుకోగా.. 15 మంది మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం 660 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధిక GHMC పరిధిలోనే ఉన్నాయి. జీహెచ్‌ఎంసీలో ఇప్పటి వరకు 540 కరోనా కేసులు నమోదవగా.. 18 మంది మరణించారు.

    Published by:Shiva Kumar Addula
    First published: