కరోనా కేసుల్లో కొత్త రికార్డు...ఒకే రోజు 90 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు...

గత 24 గంటల్లో కొత్తగా వెయ్యి 90632 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 1065 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో దేశంలో కరోనా సోకిన రోగుల సంఖ్య 41,13,811 కు పెరిగింది.

news18-telugu
Updated: September 7, 2020, 3:18 AM IST
కరోనా కేసుల్లో కొత్త రికార్డు...ఒకే రోజు 90 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు...
కరోనా కేసుల్లో కొత్త రికార్డు...ఒకే రోజు 90 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు... (credit - NIAID)
  • Share this:
దేశంలో కరోనా వైరస్ బారిన పడిన రోగుల సంఖ్య ప్రతిరోజూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా కరోనా రోగుల సంఖ్య 90 వేలు దాటేసింది. గత 24 గంటల్లో కొత్తగా వెయ్యి 90632 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 1065 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో దేశంలో కరోనా సోకిన రోగుల సంఖ్య 41,13,811 కు పెరిగింది. శనివారం దేశంలో 86,432 మంది కొత్త కేసులు నమోదు కాగా, 1089 మంది మరణించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం, దేశంలో 8,62,320 యాక్టివ్ కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, కరోనా సంక్రమణ కారణంగా 70, 626 మంది రోగులు మరణించారు. అదే సమయంలో, ఇప్పటివరకు 31,80,865 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,92,654 కరోనా టెస్టులు జరిగాయని, ఇప్పటివరకు 4,88,31,145 మందికి కరోనా టెస్టులు నిర్వహించామని ఐసిఎంఆర్ తెలిపింది.

కరోనా అప్ డేట్


శనివారం మహారాష్ట్రలో కొత్తగా 20,801 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, ఇది కూడా ఒక రకంగా కొత్త రికార్డు అనే చెప్పాలి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసులు 8,83,862 కు పెరిగాయి. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం తాజాగా 312 మంది రోగుల మరణించగా, రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 26,276 కు పెరిగింది. ఇక ఆసుపత్రి నుండి మొత్తం 10,801 మందిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 2,20,661 మంది సోకిన రోగులు చికిత్స పొందుతున్నారు.
Published by: Krishna Adithya
First published: September 6, 2020, 10:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading