భారత్‌లో కరోనా జోరు... అదే సంఖ్యలో కోలుకుంటున్న బాధితులు..

Corona Lockdown | Corona Update : దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అయితే ఈ వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా వేగంగా పెరుగుతుండటం ఊరట కలిగించే అంశం.

news18-telugu
Updated: June 19, 2020, 12:34 PM IST
భారత్‌లో కరోనా జోరు... అదే సంఖ్యలో కోలుకుంటున్న బాధితులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Corona Lockdown | Corona Update : దేశంలో కరోనా విజృంభణ అంతకంతకూ పెరుగుతోంది. లాక్‌డౌన్ సడలింపుల తరువాత వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి... దేశంలో కోరలు చాస్తోంది. తాజాగా... 24 గంటల్లో 13586 మందికి కరోనా సోకింది. ఒక రోజు వ్యవధిలో ఇన్ని పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 380532కి చేరింది. ఇక కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 12573కు చేరింది. ప్రస్తుతం ప్రస్తుతం యాక్టివ్ కేసులు 163248గా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 204710కు చేరింది. కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య వేగంగా పెరగడం ఊరట కలిగించే విషయం.

Corona virus in india, new corona virus cases in india, covid 19 cases in india, corona virus cases update, భారత్‌లో కరోనా కేసులు, కోవిడ్ 19 కేసులు, దేశంలో కరోనా కేసులు
కరోనా కేసుల అప్‌డేట్స్


కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల కంటే ముందుంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 120504 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 5751 మంది చనిపోయారు. ఇక 49979 కేసులతో దేశ రాజధాని ఢిల్లీ రెండోస్థానంలో ఉంది. కరోనా కారణంగా ఢిల్లీలో ఇప్పటివరకు 1969 మంది చనిపోయారు. మరోవైపు తెలుగురాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలోనూ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

First published: June 19, 2020, 9:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading