భారత్‌లో 4.4 లక్షలు దాటిన కరోనా కేసులు... 24 గంటల్లో 10వేలకు పైగా రికవరీలు...

భారత్‌లో 4.4 లక్షలు దాటిన కరోనా కేసులు... 24 గంటల్లో 10వేలకు పైగా రికవరీలు...

భారత్‌లో 4.4 లక్షలు దాటిన కరోనా కేసులు... 24 గంటల్లో 10వేలకు పైగా రికవరీలు...

ఇండియాలో ఓవైపు కరోనా కేసులు పెరుగుతుంటే... అంతకు మించి... రికవరీ కేసులు కూడా పెరుగుతున్నాయి. మొత్తంగా సేఫ్ జోన్‌లో మాత్రం లేమనే చెప్పాలి.

 • Share this:
  కరోనాకి వ్యాక్సిన్ రావడం కంటే... ముందుగా... చాలా మందులు వచ్చేస్తున్నాయి. తాజాగా యోగా గురు బాబా రాందేవ్ కూడా ఓ మందు తయారుచేసినట్లు చెప్పారు. అందువల్ల కరోనా విషయంలో కాస్త కాన్ఫిడెన్స్ పెంచుకోవచ్చు. ఐతే... ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా... 14933 కొత్త కేసులొచ్చాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 440215కి చేరింది. అలాగే... గత 24 గంటల్లో 312 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 14011కి చేరింది. భారత్‌లో గత 24 గంటల్లో  10994 మంది పేషంట్లు రికవరీ అయ్యారు. ఇప్పటివరకూ 248190 మంది రికవరీ కాగా... ప్రస్తుతం యాక్టివ్ కేసులు 178014గా ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు మరింత పెరిగి... 56.4 శాతానికి చేరింది.

  కొత్త కేసులతో పాటూ... మరణాల సంఖ్య కూడా మన దేశంలో ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం అత్యధిక రోజువారీ మరణాలు సంభవిస్తున్న దేశాల్లో మెక్సికే, బ్రెజిల్, అమెరికా తర్వాత భారత్ ఉంది. ఇది మనకు అత్యంత విషాదకర అంశం. ఇక రోజువారీ కొత్త కేసుల నమోదులో ఇండియా టాప్ 3లో ఉంది. మొత్తం కేసుల్లో టాప్ 4లో ఉంది. మొత్తం మరణాల్లో టాప్ 8లో ఉంది.

  ప్రస్తుతం దేశంలో 1,35,796 పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర మరో న్యూయార్క్‌ని తలపిస్తోంది. ఆ తర్వాత ఢిల్లీ, తమిళనాడుల్లో చెరో 60వేలకు పైగా కేసులున్నాయి. ప్రస్తుతం దేశంలో టెస్టుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ ల్యాబుల సంఖ్య 723కి చేరగా... ప్రైవేట్ ల్యాబుల సంఖ్య 262కి చేరింది. జూన్ 22 నాటికి దేశంలో 71 లక్షల శాంపిల్స్‌ని సేకరించి టెస్ట్ చేశారు.

  ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే... 137207 కరోనా కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 9179107కి పెరిగింది. నిన్న కొత్తగా 3850 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 473454కి పెరిగింది. ప్రస్తుతం రికవరీ కేసులు 4094210 ఉండగా... యాక్టివ్ కేసులు 3801443 ఉన్నాయి. వీటిలో 3743591 కేసుల్లో కరోనా లక్షణాలు తక్కువగానే ఉన్నాయి. అంటే వీరంతా కోలుకునే ఛాన్స్ ఉంది. 57852 మందికి మాత్రం కరోనా తీవ్రంగా ఉంది. వీళ్లకు వెంటిలేటర్‌తో ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. మొత్తం కేసుల్లో వీరి సంఖ్య 2 శాతంగా ఉంది. నెల నుంచి 1శాతంగా ఉండేది... ఇప్పుడు మరో 1 శాతం పెరిగింది. ప్రస్తుత లెక్కల ప్రకారం క్లోజింగ్ కేసుల్లో 91 శాతం మంది రికవరీ అవ్వగా... 9 శాతం మంది చనిపోయారు.

  దేశంలో కరోనా కేసుల వివరాలు


  ప్రపంచంలో కరోనా కేసుల వివరాలు
  First published: