ప్రమాద ఘంటికలు.. దేశంలో లక్షా 50 వేలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్ డౌన్ 5లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సడలింపులు జూన్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి.

కరోనా వైరస్ దేశంలో దారుణంగా విజృంభిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లోనే 6,387 కొత్త కేసులు నమోదయ్యాయి.

 • Share this:
  కరోనా వైరస్ దేశంలో దారుణంగా విజృంభిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లోనే 6,387 కొత్త కేసులు నమోదయ్యాయి. 170 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 50 వేలు దాటింది. ప్రస్తుతం ఆ సంఖ్య 1,51,767గా ఉంది. మొత్తం మరణాల సంఖ్య 4,337కు చేరుకుంది. అటు.. 64,426 మంది కరోనా రోగులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీల్లో కరోనా వ్యాప్తి దారుణంగా ఉంది. ఒక్క మహారాష్ట్రలోనే 50 వేల కేసులు నమోదయ్యాయి.

  ఇదిలా ఉండగా, తెలంగాణలో నిన్న సాయంత్రానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1991కి చేరింది. కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 57కు పెరిగింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1284గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 650 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు.. ఏపీలో నిన్న ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 2719కు చేరుకుంది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 759 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 57కు చేరుకుంది.

  ఇండియా కరోనా లేటెస్ట్ బులిటెన్
  Published by:Shravan Kumar Bommakanti
  First published: