కరోనా గురించి ఓ భయంకరమైన నిజం... మనం పాటించే దూరం సరిపోదా?

తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు కరోనా వైరస్ కణాలు 27 అడుగుల దూరం వరకు వెళ్లగలవని పరిశోధనలో తేలింది.

news18-telugu
Updated: April 2, 2020, 2:52 PM IST
కరోనా గురించి ఓ భయంకరమైన నిజం... మనం పాటించే దూరం సరిపోదా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ గురించి ఓ భయంకరమైన నిజం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అందరూ సామాజిక దూరం పాటిస్తున్నారు. ప్రజలు అందరూ ఓ మీటర్ దూరం దూరం ఉంటూ తమకు కావాల్సిన కూరగాయలు, ఇతరత్రా సరుకులు కొనుక్కుంటున్నారు. అయితే, ప్రస్తుతం పాటిస్తున్న దూరం ఏ మాత్రం సరిపోదనే ఓ భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఓ సరికొత్త విషయాన్ని కనుగొంది. ప్రస్తుతం అందరూ కరోనా సోకకుండా ఉండాలంటే ఒక ఆరు అడుగుల దూరం పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు. అయితే, కరోనా ఏకంగా 27 అడుగుల వరకు ప్రయాణించగలదట. అంతేకాదు, ఏకంగా కొన్ని గంటల పాటు గాలిలో జీవించగలదని ఆ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బయటకు వ్యాపించే సూక్ష్మజీవుల మీద కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్న MIT అసోసియేట్ ప్రొఫెసర్ లిడియా బౌరౌబా ఈ విషయాన్ని గుర్తించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ఆరు అడుగల దూరం అనే విధానం 1930ల నాటిదని ఆయన చెప్పారు. ఆయన చేసిన పరిశోధన పత్రం జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్‌లో ప్రచురితం అయింది.

కోవిడ్ 19 సోకిన వారి వెంటిలేషన్ మీద కూడా వైరస్ కణాలు ఉంటాయని చైనాకు చెందిన ఓ నివేదిక తెలిపినట్టు ఆమె చెప్పారు. ప్రస్తుతం అమలు చేస్తున్న WHO గైడ్ లైన్స్ మార్చాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే, అధునాతన పరికరాలు, హెల్త్ కేర్ వర్కర్లకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. మూడు అడుగుల దూరం ఉంటే సరిపోతుందని చెప్పిన WHO కూడా MIT ప్రొఫెసర్ రిసెర్చ్‌ను స్వాగతించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: April 2, 2020, 2:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading