బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్య పరిస్థితి దారుణంగా తయారైంది. కరోనా లక్షణాలు తీవ్రం కావడంతో ఆయన్ను ఐసీయూకు తరలించారు. కరోనా సోకి లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బోరిస్ ఆదివారం సాయంత్రం నుంచి మరింత ఇబ్బంది పడ్డారు. దీంతో వైద్యులు స్పెషల్ కేర్ తీసుకొని చికిత్స అందించారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం రాత్రి ఇంటెన్సివ్ కేర్‌కు తరలించామని ప్రధాని విదేశాంగ సెక్రటరీ డొమినిక్ రాబ్ తెలిపారు. బోరిస్ ఆరోగ్య పరిస్థితిపై అమెరికా ప్రధాని ట్రంప్ స్పందించారు. బోరిస్‌కు మంచి వైద్యం అందించేలా డాక్టర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. తనకు, అమెరికాకు బోరిస్ మంచి స్నేహితుడని ఈ సందర్భంగా ట్రంప్ గుర్తు చేసుకున్నారు. అటు.. బ్రిటన్‌లో సోమవారం 439 మంది మృతి చెందారు. దీంతో మరణాలు 5,373కి చేరాయి. 24 గంటల్లోనే స్పెయిన్‌లో 637, ఇటలీలో 636 మంది చనిపోయారు.
ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా 70 వేల మందిని కరోనా బలితీసుకుంది. ఒక్క యూరప్‌లోనే 50,125 మంది మృత్యువాతపడ్డారు. 15,877 మరణాలతో ఇటలీ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, 13,055 మరణాలతో స్పెయిన్, 8,078 మరణాలతో ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. లక్ష పాజిటివ్ కేసుల జాబితాలో జర్మనీ చేరిపోయింది.