Home /News /coronavirus-latest-news /

CORONAVIRUS BJP MLA RAJA SINGH ALLOTS 3 CARS WITH DRIVERS FOR MEDICAL EMERGENCY IN HYDERABAD SK

అత్యవసర సేవల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. వారికి ప్రత్యేక సాయం

అత్యవసర సేవల్లో ఎమ్మెల్యే రాజాసింగ్

అత్యవసర సేవల్లో ఎమ్మెల్యే రాజాసింగ్

తెలంగాణలో ఇప్పటి వరకు 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో తొలి కరోనా పేషెంట్ కోలుకొని డిశ్చార్జి కాగా.. మిగతా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

    తెలంగాణలో లాక్‌డౌన్ పకడ్బందీగా కొనసాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా చోట్ల సామాజిక దూరం పాటిస్తూ కరోనాపై పోరాటానికి సహకరిస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రజా ప్రతినిధులు రంగంలోకి దిగారు. కొందరు కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటే.. మరికొందరు లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు సేవలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా పెద్ద మనసు చాటుకున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అత్యవసరంగా ఆస్పత్రులకు వెళ్లాల్సిన వారికి, వృద్ధులకు తన వంతుగా సాయం చేస్తున్నారు. ఎమర్జెన్సీ సేవల కోసం మూడు కార్లు అందుబాటులో ఉంచామని.. ఎవరికి అవసరం ఉన్నా, ఫోన్ చేసిన 10 నిమిషాల్లో వారి ఇంటికి చేరుకుంటుందని చెప్పారు రాజాసింగ్. గోషామహల్‌ పరిధిలో ఉన్న ప్రజలు తనను నేరుగా సంప్రదించవచ్చని సూచించారు.
    మరోవైపు తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో తొలి కరోనా పేషెంట్ కోలుకొని డిశ్చార్జి కాగా.. మిగతా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, Hyderabad, Raja Singh, Telangana

    తదుపరి వార్తలు