భారత్‌లో కరోనా విలయ తాండవం చేస్తోంది. పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నట్లు బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ ప్రకటించారు. సంపూర్ణ లాక్‌డౌన్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను కూడా బీహార్ ప్రభుత్వం వెల్లడించింది. దీని ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఈ నెలాఖరు వరకు మూసివేయాలి. ప్రార్థనా మందిరాలకు భక్తులను అనుమతించరు. వ్యవసాయ, నిర్మాణ రంగ పనులకు అనుమతి ఉంటుంది. ఇక కేవలం నిత్యావసర దుకాణాలు మాత్రమే తెరిచి ఉంటాయి.
Bihar govt issues guidelines for lockdown from 16 to 31 July: Farming & construction-related activities allowed. Places of worship to remain closed. Commercial, private and govt establishments to remain closed apart from mentioned exceptions. Essential services allowed. #COVID19https://t.co/wUGEzu1FG8pic.twitter.com/p6lIYplqmD
కాగా, బీహార్‌లో ఇప్పటి వరకు 17,421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 12,364 మంది కోలుకొని కరోనాను జయించారు. కరోనా బారినపడి 134 మంది మరణించారు. ప్రస్తుతం బీహార్‌లో 4,923 యాక్టివ్ కేసులున్నాయి.