కరోనా పరీక్ష చేయించుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

కరోనా పరీక్ష చేయించుకున్న సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)

ఏపీలో మొత్తం కరోనా రోగుల సంఖ్య 572కు చేరింది. మొత్తంగా 35 మంది డిశ్చార్జి కాగా, 14 మంది మరణించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 523 మంది చికిత్స పొందుతున్నారు.

  • Share this:
    ఏసీ సీఎం వైఎస్ జగన్ కరోనా పరీక్ష చేయించుకున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎంకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. సౌత్ కొరియా నుంచి వచ్చిన కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా టెస్ట్ చేశారు. పరీక్షల్లో సీఎం జగన్‌కు కరోనా నెగెటివ్ వచ్చింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలను వేగవంతం చేసేందుకు కంకణం కట్టుకున్న ఏపీ సర్కార్.. లక్ష ర్యాపిడ్ కిట్లు ఆర్డర్ ఇచ్చింది. సియోల్ నుంచి ప్రత్యేక చార్జర్ విమానం ద్వారా శుక్రవారం ఆ ర్యాపిడ్ కిట్లు ఏపీకి చేరుకున్నాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ టెస్టు కిట్లను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందుకొని పరిశీలించారు. అనంతరం తొలి పరీక్ష చేయించుకున్నారు సీఎం. వీటి ద్వారా కేవలం 10 నిమిషాల్లో కరోనా ఫలితం వస్తుందని అధికారులు చెప్పారు.

    రాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా కరోనా పరీక్షలు చేసే విధానంపై ఇప్పటికే అన్ని జిల్లాల్లోని డాక్టర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ కిట్ల ద్వారా అన్ని కరోనా ఆస్పత్రుల్లోనూ పరీక్షలను వేగవంతం చేయాలని సూచించారు. ఏపీలో రాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులోకి రావడంతో రేపటి నుంచి మరింత వేగంగా పరీక్షలు జరగనున్నాయి.


    గత 24 గంటల్లో కొత్తగా 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా రోగుల సంఖ్య 572కు చేరింది. మొత్తంగా 35 మంది డిశ్చార్జి కాగా, 14 మంది మరణించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 523 మంది చికిత్స పొందుతున్నారు. కర్నూలు, గుంటూరులోనే ఏకంగా 252 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో 126, గుంటూరులో 126 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో అనంతపూర్‌లో 5, చిత్తూరులో 5, గుంటూరులో 4, కడపలో 1, కృష్ణాలో 4, కర్నూలులో 13, నెల్లూరులో 6 కరోనా కేసులు నమోదయ్యాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: