కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముస్లిం మత పెద్దలకు ఏపీ సీఎం వైఎస్ కీలక విజ్ఞప్తి చేశారు. రంజాన్ ప్రార్థనలను ఇళ్లల్లోనే చేసుకోవాలని కోరారు. అమరావతి నుంచి
జిల్లా కలెక్టర్లు, ముస్లిం మత పెద్దలతో సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రంజాన్‌ను ఇళ్లల్లోనే ఉండి సెలబ్రేట్ చేసుకోవాలని.. ఈ మేరకు అందరికీ చెప్పాలంటూ ముస్లిం మత పెద్దలను ఆయన కోరారు. ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగతో పాటు రంజాన్ కూడా ఇదే సమయంలో వచ్చిందని.. కరోనాను కట్టడి చేసేందుకు ఇళ్లలోనే ఉండి రంజాన్ జరుపుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని అన్నారు. ప్రభుత్వానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా తప్పుడు ప్రచారాలు, నకిలీ వార్తలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు ముస్లి మత పెద్దలు. అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కర్నూలులో కోవిడ్ నివారణా చర్యలు గట్టిగా తీసుకుంటున్నాని.. అందరూ కూడా కోవిడ్ –19 నివారణా చర్యలకు సహకరిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలు కూడా చాలా బాగున్నాయని.. కాని కొన్ని పత్రికలు, ఛానళ్లు ఉద్దేశ పూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. నకిలీ వార్తలు, నకిలీ వీడియోలు ప్రచారంచేస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు, భయాందోళనలు కలిగిస్తున్నారని వాపోయారు. కర్నూలు ఎమ్మెల్యేమీద కూడా లేనిపోని ప్రచారాలు చేస్తున్నారన్న మతపెదద్దలు.. తప్పుడు వార్తలు, అపోహలు కలింగించే సమాచారాన్ని ప్రచారం చేయడంపై ముఖ్యమంత్రిగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్.. ఫేక్ వార్తలు, తప్పుడు ప్రచారంపై నివేదిక పంపాలని కలెక్టర్‌కు, ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఇక రంజాన్ సమయంలో ఇంట్లోనే ప్రార్థనలు చేసుకునేలా చూస్తామని ముస్లిం మతపెద్దలు సీఎం జగన్‌కు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కేసుల వ్యాప్తి, విస్తరణ తగ్గుతోందని.. ఒక మనిషికి రోజుకు రూ. 500లు చొప్పున భోజనం కోసం ఖర్చు పెడుతున్నారు, ఇది చాలా మంచి నిర్ణయమని ప్రశంసించారు. ముందుచూపుతో సీఎంగారు ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ విపత్తును ఎదుర్కోవడానికి బాగా పనికి వచ్చింది, వారి సేవలు అమూల్యమైనవని అభిప్రాయపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, AP News, Lockdown, Ramzan, Ys jagan