Coronavirus: కరోనాపై కేంద్ర కేబినేట్ సెక్రటరీ అత్యవసర సమావేశం...ఈ-వీసాలు తాత్కాలికంగా రద్దు

జనవరి 15 తర్వాత చైనా నుంచి వచ్చిన వాళ్లందర్నీ పరీక్షించడంతో పాటు వీళ్లందర్నీ 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలి ఆదేశింశారు. అలాగే, చైనా వెళ్లే ప్రయాణం మానుకోవాలని సూచించారు. ఈ-వీసాలను రద్దు చేశారు.

news18-telugu
Updated: February 2, 2020, 10:37 PM IST
Coronavirus: కరోనాపై కేంద్ర కేబినేట్ సెక్రటరీ అత్యవసర సమావేశం...ఈ-వీసాలు తాత్కాలికంగా రద్దు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Coronavirus: కరోనా వైరస్‌ ప్రభావం, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర కేబినేట్ సెక్రటరీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర హెల్త్‌ సెక్రటరీతో పాటు, విదేశాంగ శాఖ, కేంద్ర హోం శాఖ, కేంద్ర విమానయాన శాఖ, డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, ఐటీబీపీ, ఎఎఫ్ఎంఎస్, ఎన్డీఎంఏ సంస్థల ప్రతినిధులు, వైద్యాధికారులతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఇందులో నూతన ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు. ఇందులో జనవరి 15 తర్వాత చైనా నుంచి వచ్చిన వాళ్లందర్నీ పరీక్షించడంతో పాటు వీళ్లందర్నీ 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలి ఆదేశింశారు. అలాగే, చైనా వెళ్లే ప్రయాణం మానుకోవాలని సూచించారు. ఈ-వీసాలను రద్దు చేశారు.  కేంద్ర హెల్త్‌ సెక్రటరీ. ల్యాబ్‌ సౌకర్యాలు మెరుగుపర్చాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అంతేకాదు ఇప్పటికే సుమారు 445 విమానాలతో పాటు మొత్తం 58658 మంది పాసెంజర్లకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. అలాగే మొత్తం 142 మందిలో వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అనుమానించి, వారిని ప్రత్యేకంగా ఐసోషన్ సెంటర్ కు తరలించినట్లు కేంద్ర ఒక ప్రకటన జారీ చేసింది. వీరిలో మొత్తం 130 మంది శాంపిళ్లను పరీక్ష చేయగా అందులో 128 మందికి వైరస్ సోకనట్లు నిర్ధారించారు. కేరళలో ఇద్దరికి వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఇక చైనా నుంచి రెండోవిడత విమానం ద్వారా 330 మంది ప్యాసింజర్లను స్వదేశానికి రప్పించారు. వీరిని ప్రత్యేక క్యాంపులకు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కరోనాపై చేతులెత్తేసిన పాకిస్థాన్...స్వదేశానికి రావద్దని చైనాలోని విద్యార్థులకు సూచన

చైనాలోని వుహాన్ ప్రాంతంలో చిక్కుకున్న పాకిస్థాన్ విద్యార్థులు కరోనా వైరస్ నుంచి తమను కాపాడాలని లబోదిబోమంటున్నారు. అయితే పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పాక్ విద్యార్థులను గాలికి వదిలేసింది. అంతేకాదు పాక్ ఎంబసీ విద్యార్థులను చైనాలోనే జాగ్రత్తగా ఉండాలని, స్వదేశానికి వచ్చే ప్రయత్నం చేయవద్దని సూచించడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే చైనాలో ఇప్పటికే కరోనా బారిన పడి 260 మంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ పాకిస్థాన్ ప్రభుత్వం తమ విద్యార్థును స్వదేశానికి రావద్దని సూచిస్తోంది. కరోనా దేశంలోకి రాకుండా తీసుకునే ఆధునిక నివారణ పద్ధతులు తమ ఎయిర్ పోర్టుల్లో అందుబాటులో లేవని, వీలైనంత వరకూ చైనాలోని పాక్ విద్యార్థులు, ఉద్యోగులు అక్కడే చికిత్స చేయించుకోవాలని సూచించింది.

ఇప్పటికే పాకిస్థాన్ రాయబారి నగ్మానా హష్మీ వుహాన్ లో ఉంటున్న పాక్ దేశస్థులు అక్కడే ఉండి చికిత్స చేయించుకోవాలని సూచించింది. పాక్ లో కరోనా వైరస్ వ్యాపించకుండా నిరోధించే వ్యవస్థ గానీ, సామర్థ్యంగానీ దేశానికి లేవని పేర్కొంది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తరువాత వుహాన్‌లో పర్యటిస్తామని, అంతేకాదు తమ విద్యార్థులు, ఉద్యోగులకు జాగ్రత్తగా చూసుకునేలా చైనా ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరినట్లు చైనాలోని పాక్ రాయబార కార్యాలయం ప్రతినిధులు తెలిపారు.



అయితే వుహాన్ లో ఉంటున్న తమ పిల్లల్ని కాపాడాలని పాక్ లోని విద్యార్థులు తల్లిదండ్రులు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీనిపై పాక్ ప్రభుత్వం మాత్రం చైనా నుంచి తమ పౌరులను ఎట్టి పరిస్థితుల్లో తెచ్చే ప్రయత్నం చేయడం లేదని ప్రకటించింది.
First published: February 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు