Home /News /coronavirus-latest-news /

CORONAVIRUS ANTIGEN COVID TESTS WILL BE CONDUCTED IN BASTI HOSPITALS IN HYDERABAD SK

హైదరాబాద్ బస్తీ దవాఖానాల్లోనూ కరోనా పరీక్షలు.. నేటి నుంచే..

కరోనా వైరస్ ప్రజలను ఎంతగా భయపెడుతుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ.

కరోనా వైరస్ ప్రజలను ఎంతగా భయపెడుతుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ.

ఇప్పటికే నగరంలోని 90 ఆరోగ్య కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పుడు బస్తీ దవాఖానాల్లోనూ టెస్ట్‌లు చేస్తుండడంతో పరీక్షల సంఖ్య మరింతగా పెరగనుంది.

    తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజుకు భారీగా కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఐతే వీటిలో అత్యధిక కేసులు జీహెచ్ఎంసీ నుంచే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం నుంచి జీహెచ్ఎంసీలో ఉన్న 167 బస్తీ దవాఖానాల్లోనూ యాంటిజెన్ కరోనా పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నగరంలోని 90 ఆరోగ్య కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పుడు బస్తీ దవాఖానాల్లోనూ టెస్ట్‌లు చేస్తుండడంతో పరీక్షల సంఖ్య మరింతగా పెరగనుంది.

    అటు రాష్ట్రవ్యాప్తంగానూ పెద్ద ఎత్తున యాంటిజెన్ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని మెడికల్ కాలేజీలు, జిల్లా ఆస్పత్రుల్లో పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. ఐతే ఈ యాంటిజెన్ టెస్టులను అందరికీ చేయరు. కేవలం కరోనా లక్షణాలు కలిగిన వారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారు. యాంటిజెన్ పరీక్షలు చేసే ఆస్పత్రుల్లో ఫీవర్ క్లినిక్‌లను ఏర్పాటు చేసి.. అక్కడ జ్వరం, జలుబు, పొడి దగ్గు, గొంతునొప్పి, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఉన్న వారికి విడిగా ఈ క్లినిక్‌ల పరీక్షలు చేస్తారు.

    ప్రస్తుతం కోవిడ్-19 నిర్ధారణకు RT-PCR (రియల్ టైమ్ పాలిమెరేజ్ చైన్ రియాక్షన్) విధానంలో పరీక్షలు చేస్తున్నారు. ఐతే దీనికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అంతేకాదు ఒక్కో RT-PCR ధర రూ.2500. ఈ విధానంలో పరీక్షలు చేయాలంటే శాంపిల్స్‌ను ప్రత్యేకమైన ద్రావణంలో నిల్వ చేయడంతో పాటు ప్రత్యేకమైన కిట్‌లో రవాణా చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా ఖర్చు మరింత పెరుగుతుంది.

    అదే స్టాండర్డ్ క్యూ కోవిడ్ 19 ఏజీ డిటెక్షన్ కిట్‌‌ రూ.500 మాత్రమే లభిస్తుంది. ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ల్యాబ్లోనే కాకుండా క్షేత్రస్థాయిలోనూ పరీక్షలు చేయవచ్చు. యాంటిజెన్ టెస్టులో ఫలితం పాజిటివ్‌ వస్తే పాజిటివ్‌గానే పరిగణిస్తారు. నెగెటివ్ వచ్చిన వారిలో కరోనా లక్షణాలు లేకుంటే నెగెటివ్‌గా పరిగణిస్తారు. కరోనా లక్షణాలు ఉడి నెగెటివ్‌ వస్తే మాత్రం ఆర్‌టీ–పీసీఆర్‌ పద్దతిలో మరోసారి పరీక్ష చేయాల్సి ఉంటుంది. యాంటిజెన్ టెస్టులో పాజిటివ్‌ వస్తే దాని కచ్చితత్వం 99.3 నుండి 100 శాతం ఉంటుంది. అదే నెగెటివ్ వస్తే కచ్చితత్వం 50 నుంచి 70 శాతం వరకు మాత్రమే ఉంటుంది. ఇందులో ఇదే ప్రధాన లోపం.


    .
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, Covid-19, GHMC, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు