టెస్ట్ చేయకుండానే కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్స్.. ప్రైవేట్ ఆస్పత్రుల నయా దందా..

టెస్ట్ చేయకుండానే కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్స్.. ప్రైవేట్ ఆస్పత్రుల నయా దందా..

ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్లు ఇస్తామంటూ ఆస్పత్రి సిబ్బంది మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాని ఆధారంగా పోలీసులు, వైధ్యాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 • Share this:
  కరోనా వైరస్ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులపై ఇప్పటికే ఎన్నో ఆరోపణలున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్ టెస్ట్‌లు చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షణాలు లేని వారికి కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారని.. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా చెల్లించేవారినే ఆస్పత్రుల్లో చేర్చుకుంటున్నారని.. ప్రభుత్వాలకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలో కరోనా పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు చేస్తున్న దారుణ దందా వెలుగులోకి వచ్చింది. ఎలాంటి పరీక్షలు చేయకుండానే.. కరోనా నెగెటివ్ సర్టిఫికెట్లు ఇస్తున్నాయి. యూపీలో మీరట్‌లో ఈ ఘటన జరిగింది.

  ప్రస్తుతం లాక్‌డౌన్ నిబంధనలల నుంచి ఎన్నో సడలింపులు ఉన్నాయి. అన్‌లాక్ 2 దశలో ఉన్నాం. సాధారణ కార్యకలాపాలు యథాతధంగా జరుగుతున్నాయి. ఐతే ఎక్కిడికి వెళ్లినా.. అందరూ కరోనా ఉందేమోనన్న అనుమానంతో చూస్తున్నారు. ఇక పక్క రాష్ట్రాలు, కొత్త ప్రాంతాలకు వెళ్తే.. కరోనా టెస్ట్ చేయించుకున్నావా..? అని మొదట ఇదే ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అలాంటి ఇబ్బందులు పడే వారిని దృష్టిలో ఉంచుకొని.. మీరట్‌లోని న్యూ మీరట్ ఆస్పత్రి నయా దందా షురూచేసింది. ఎలాంటి టెస్ట్‌లు చేయకుండానే నెగెటివ్ రిపోర్టులు ఇస్తున్నాయి. అందుకు కేవలం రూ.2,500 చెల్లిస్తే సరిపోతుంది.

  కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్లు ఇస్తామంటూ ఆస్పత్రి సిబ్బంది మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాని ఆధారంగా పోలీసులు, వైధ్యాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆస్పత్రిని సీజ్ చేసి, లైసెన్స్‌ను రద్దు చేశారు. ఆస్పత్రి నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారిస్తున్నారు. ఐతే ఈ ఆరోపణలను న్యూ మీరట్ ఆస్పత్రి యజమాని షా ఆలం ఖండించారు. తానే తప్పు చేయలేదని.. ఎవరో ఉద్దేశ్యపూర్తకంగానే ఇలా చేశారని చెప్పారు. విచారణ అనంతరం తాను నిర్దోషిగా బయటకొస్తానని స్పష్టం చేశారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు