news18-telugu
Updated: July 13, 2020, 8:59 PM IST
ప్రతీకాత్మక చిత్రం
నల్గొండ జిల్లాలో కలకలం రేగింది. ఓ కరోనా బాధితురాలు పారిపోయి ప్రభుత్వాస్పత్రి నుంచి పారిపోయి.. తమ గ్రామంలో ప్రత్యక్షమైంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండల యాద్గార్ గ్రామానికి చెందిన మహిళకు కరోనా సోకింది. నల్గొండ ప్రభుత్వాస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఐతే సోమవారం డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్ల కళ్లుగప్పి పారిపోయింది. ఆస్పత్రి నుంచి నేరుగా తమ గ్రామానికి వెళ్లిపోయింది. ఆమెను చూసి షాక్ తిన్న గ్రామస్తులు.. ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు గ్రామానికి చేరుకున్నారు. వైద్య సిబ్బంది సాయంతో 108 వాహనంలో మళ్లీ ఆస్పత్రికి తరలించారు.
కాగా, ఆదివారం రాత్రి వరకు తెలంగాణ ప్రభుత్వం 1,70,324 కరోనా వైరస్ టెస్టులు నిర్వహించింది. అందులో 1,35,653 ఫలితాలు నెగిటివ్ వచ్చాయి. 34,671 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 11,883 మంది చికిత్స పొందుతున్నారు. 22,482 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 356 మంది కరోనా వల్ల చనిపోయారు
Published by:
Shiva Kumar Addula
First published:
July 13, 2020, 8:54 PM IST