తెలంగాణలో 100కు చేరువలో కరోనా మరణాలు..

రాష్ట్రం నమోదైన మొత్తం కేసుల్లో.. కరోనా వైరస్‌‌తో పోరాడుతూ 1526 మంది కోలుకున్నారు. 92 మంది మరణించారు.

news18-telugu
Updated: June 2, 2020, 10:05 PM IST
తెలంగాణలో 100కు చేరువలో కరోనా మరణాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. ప్రతి రోజు భారీ మొత్తంలో కొత్త కేసులు వస్తున్నాయి. మంగళవారం 99 కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 70, రంగారెడ్డి 7, మేడ్చల్ 3, నల్గొండ 2, మహబూబ్ నగర్, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, సిద్దిపేటలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. మరో 12 మంది వలస కూలీలు కరోనా బారినపడ్డారు. మంగళవారం నలుగురు కరోనా రోగులు మరణించారు. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,891కి చేరింది. వీరిలో 446 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు.

కరోనా వైరస్‌‌తో పోరాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు 1526 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1273 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం గుండె సంబంధ వ్యాధులున్న 42 ఏళ్ల పురుషుడు, థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న 41 ఏళ్ల పురుషుడు, హైపర్ టెన్షన్ ఉన్న 70 ఏళ్ల మహిళ, మరో 60 ఏళ్ల మహిళ కరోనాతో చనిపోయారు. వీరిలో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 92కి చేరింది.

తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్
First published: June 2, 2020, 9:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading